తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ రికార్డు​: ఆరంభ మ్యాచ్​కి 20 కోట్ల వీక్షణలు - చెన్నై వర్సెస్​ ముంబయి 2020

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ (ఐపీఎల్​) 13వ సీజన్​ ఆరంభ మ్యాచ్​ ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన లీగ్​గా పేరొందింది. బార్క్​ నివేదిక ప్రకారం చెన్నై, ముంబయి మధ్య జరిగిన మ్యాచ్​ను 20 కోట్ల మంది వీక్షించారని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు.

Record 20 crore people watched IPL 2020 opener: BCCI secretary
ఐపీఎల్ రికార్డు​: ఆరంభ మ్యాచ్​కు 20 కోట్ల వీక్షణలు

By

Published : Sep 23, 2020, 7:07 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్​-13 సీజన్​ ఆరంభ మ్యాచ్​ అదిరిపోయింది. ఊహించినట్లే టోర్నీ వీక్షకుల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబయి ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో 20 కోట్ల మంది చూశారని, మరే లీగ్‌ను ఇంతమంది వీక్షించలేదని బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పాడు.

"ఐపీఎల్‌ ఆరంభ మ్యాచ్‌ కొత్త రికార్డు సృష్టించింది. బార్క్‌ నివేదిక ప్రకారం మొదటి మ్యాచ్‌ను 20 కోట్ల మంది వీక్షించారు. ప్రపంచంలో మరే లీగ్‌ తొలి మ్యాచ్‌ను ఏ దేశంలో కూడా ఇంతమంది చూడలేదు" అని జై షా తెలిపాడు. ఈసారి ఐపీఎల్‌ వీక్షకుల సంఖ్య పరంగా రికార్డు సృష్టిస్తుందని లీగ్‌కు కొన్ని వారాల ముందే బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details