తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్: చెన్నైXహైదరాబాద్​..గెలుపు ఎవరిది! - సీఎస్కే స్క్వాడ్ టుడే

రెండు వరుస పరాజయాల తర్వాత విజయాన్ని అందుకున్న జోష్​లో సన్​రైజర్స్​ హైదరాబాద్ ఉండగా.. వరుసగా రెండు ఓటములతో చెన్నై సూపర్​కింగ్స్​ సతమతమవుతోంది. ఈ మ్యాచ్​లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి ఇరుజట్లు.

Rayudu comeback big boost as CSK take on upbeat Sunrisers Hyderabad
చెన్నై Vs హైదరాబాద్​​: రెండో విజయం కోసం ఇరుజట్ల పోరాటం

By

Published : Oct 2, 2020, 5:28 AM IST

ఐపీఎల్ ప్రస్తుత​ సీజన్​ ప్రారంభమ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై అద్భుత ఇన్నింగ్స్​తో జట్టుకు విజయాన్ని అందించడంలో కీలకపాత్ర పోషించాడు చెన్నై సూపర్​కింగ్స్​ బ్యాట్స్​మన్​ అంబటి రాయుడు. ముంబయిపై జరిగిన ప్రారంభ ఐపీఎల్​ మ్యాచ్​లో రాయుడుకి తొడ కండరం పట్టేసింది. దీంతో ఆ జట్టు ఆడిన తర్వాతి రెండు మ్యాచ్​లకు అతడు దూరమయ్యాడు. కరీబియన్​ లీగ్​ నుంచి వచ్చిన బ్రావోకు కూడా గాయం కారణంగా బౌలింగ్​ చేయలేదు. శుక్రవారం సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరగనున్న మ్యాచ్​లో అంబటి రాయుడు, బ్రావో అందుబాటులో ఉంటారని సీఎస్కే సీఈఓ విశ్వనాథన్​ వెల్లడించాడు.

చెన్నై సూపర్​కింగ్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్లు గత ఐపీఎల్​ సీజన్లలో ప్రారంభం నుంచే ఆధిపత్య పోరును కొనసాగించేవి. కానీ, ప్రస్తుత ఐపీఎల్​లో మిడిల్​ ఆర్డర్​ లేదా బౌలింగ్​ కారణాల వల్ల వరుస పరాజయాలను ఈ రెండు జట్లు ఎదుర్కొంటున్నాయి. ఎప్పుడూ లేని విధంగా పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో సీఎస్కే, ఎస్​ఆర్​హెచ్​ ఉండటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

రాయుడు పక్కా.. బ్రావో డౌటే!

చెన్నై సూపర్​కింగ్స్​ జట్టుకు అంబటి రాయుడు రాకతో ఫామ్​ కోల్పోయిన మురళీ విజయ్ స్థానంలో షేన్​ వాట్సన్​తో ఓపెనర్​గా బరిలో దిగే అవకాశం ఉంది. బ్రావోకు ఈ మ్యాచ్​లో అవకాశంపై స్పష్టత లేదు. ఎందుకంటే బ్రావోను జట్టులోకి తీసుకోవాలంటే బౌలింగ్​ లైనప్​లో వచ్చే మార్పులు ధోనీకి నచ్చకపోవచ్చు.

మిడిల్​ ఆర్డర్​ బ్యాట్స్​మన్​ కేదార్​ జాదవ్​ ప్రదర్శన ధోనీకి ఆందోళన కలిగిస్తోంది. అయినా ఇతడి స్థానాన్ని మార్చడానికి మహీ సిద్ధంగా లేడు. సామ్​ కరన్​ ఆల్​రౌండర్​ ప్రతిభ కనబరుస్తున్నాడు. బ్రావోకు జట్టులో చోటు కల్పించాలంటే ఓపెనర్​ వాట్సన్​ లేదా సీమర్​ జోష్​ హాజిల్​వుడ్​లలో ఎవరో ఒకర్ని దూరం పెట్టాలి. వీరిద్దరూ కొంత మెరుగ్గా కనిపించడం వల్ల వీరిని తీసేసి బ్రావోను తీసుకునే అవకాశం లేదు.

సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్టులో కీలక ఆటగాళ్లైన జానీ బెయిర్​స్టో, డేవిడ్​ వార్నర్​లు ఎప్పటిలాగే ఓపెనింగ్​ బ్యాటింగ్​ చేస్తారు. వీరిద్దరితో పాటు మిడిల్​ ఆర్డర్​లో కేన్​ విలియమ్సన్​తో బ్యాటింగ్​ లైనప్​ ధృఢంగా ఉంది. ఒకవేళ మిడిల్​ ఆర్డర్​ విఫలమైతే అందు కోసం ఓ భారతీయ హిట్టర్​ను ఎంపిక చేయడానికి యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది.

బలమైన బౌలింగ్​ లైనప్​లు

బౌలింగ్​ లైనప్​లో రెండు జట్లూ బలంగానే ఉన్నాయి. దుబాయ్​ మైదానంలో​ సీఎస్కే బౌలర్లు దీపక్​ చాహర్​, హాజిల్​వుడ్​, సామ్​ కరన్​, రవీంద్ర జడేజా, పియూష్​ చావ్లా రాణించే అవకాశం ఉంది. సన్​రైజర్స్​ హైదరాబాద్​లో డెత్​ ఓవర్​ స్పెషలిస్టు టి నటరాజన్​తో పాటు ప్రపంచ నంబర్​వన్​ టీ20 బౌలర్​ రషీద్​ ఖాన్​ కూడా ఉత్తమ ఎంపికగా ఉన్నాడు. వీరిద్దరూ దిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. మూడు వికెట్లు పడకొట్టిన రషీద్​ ఖాన్​ మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​గా నిలిచాడు.

చెన్నై సూపర్​కింగ్స్, సన్​రైజర్స్​ హైదరాబాద్​ జట్ల మధ్య మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం శుక్రవారం(అక్టోబరు 2) రాత్రి 7:30 గంటల నుంచి ప్రారంభంకానుంది.

చెన్నై సూపర్​కింగ్స్: ధోనీ (కెప్టెన్, వికెట్​ కీపర్​), మురళీ విజయ్, అంబటి రాయుడు, డుప్లెసిస్, షేన్ వాట్సన్, కేదార్ జాదవ్, డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, లుంగీ ఎంగిడి, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్, జోష్ హాజిల్‌వుడ్, శార్దూల్ ఠాకూర్, సామ్ కరన్​, ఎన్ జగదీశన్, ఆసిఫ్, మోను కుమార్, ఆర్ సాయి కిషోర్, రుతురాజ్ గైక్వాడ్, కరణ్ శర్మ.

సన్‌రైజర్స్ హైదరాబాద్:డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, కేన్ విలియమ్సన్, మనీష్ పాండే, శ్రీవాత్స గోస్వామి, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, వృద్దిమాన్ సాహా, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, సంజయ్ యాదవ్, ఫాబియన్ అలెన్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, టి నటరాజన్, బాసిల్ తంపి.

ABOUT THE AUTHOR

...view details