జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు రషీద్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అసలు గురితప్పడని సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రశంసించాడు. అతడో ప్రపంచస్థాయి బౌలర్ అని పొగడ్తలు కురిపించాడు. పంజాబ్ జట్టుతో గురువారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్, 69 పరుగుల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టులో వార్నర్(52), బెయిర్ స్టో(97) తొలి వికెట్కు 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మిగతా బ్యాట్స్మెన్ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం వల్ల నిర్ణీత ఓవర్లలో 202 పరుగులు చేయగలిగిందీ సన్రైజర్స్. ఛేదనలో పంజాబ్ 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్ (77) ఒంటరి పోరాటం చేశాడు.