తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలాంటి ట్వీట్లు సరికాదు: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ - RR tweet Biryani

సన్​రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన ట్విట్టర్ సంభాషణపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇరుజట్లు ప్రాంతం, ఆహారపు అలవాట్లపై కామెంట్లు చేసుకోవడం సరికాదని మందలించారు.

Rajeev Shukla reprimands SRH, RR for bringing in regionalism in banter
అలాంటి ట్వీట్లు సరికాదు: ఐపీఎల్ మాజీ ఛైర్మన్

By

Published : Oct 23, 2020, 9:29 PM IST

Updated : Oct 23, 2020, 10:38 PM IST

రాజస్థాన్ రాయల్స్​తో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించింది. ఇంతకుముందు ఈ రెండింటి మధ్య జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్ గెలుపొందింది. ఆ సమయంలో బిర్యానీ గురించి ఓ ట్వీట్ చేసింది రాయల్స్. అప్పటి ట్వీట్​కు బదులుగా గురువారం రాజస్థాన్​పై గెలిచిన అనంతరం హైదరాబాద్​ మరో ట్వీట్ చేసింది. తాజాగా ఈ ప్రాంతీయతతో కూడిన ట్వీట్లపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఇలాంటి ట్వీట్లు సరికాదంటూ మందలించారు.

"హా హా.. ఇలాంటి ట్వీట్లు చమత్కారంగా అయితే బాగుంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఇరుజట్ల నుంచి ఇలాంటి ట్వీట్లు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. ఇది ఆట స్ఫూర్తిని దెబ్బతీస్తాయి"

-రాజీవ్ శుక్లా, ఐపీఎల్ మాజీ ఛైర్మన్

తర్వాత ఓ హైదరాబాద్ ఫ్యాన్.. రాజీవ్ శుక్లా తీరును తప్పుబట్టడం వల్ల మళ్లీ క్లారిటీ ఇచ్చారు. "మీ ఫీలింగ్స్​ను అర్థం చేసుకోగలను. మొదట రాజస్థాన్ దీనిని ప్రారంభించింది. దీనికి ధీటుగా హైదరాబాద్ బదులిచ్చింది. అందువల్ల నేను రెండు జట్లను వేడుకుంటున్నా. ఇలాంటివి చమత్కారంగా అయితే ఓకే.. కానీ ఇరుజట్లు ప్రాంతం, ఆహారపు అలవాట్లపై కామెంట్లు చేసుకోకూడదు" అంటూ బదులిచ్చారు.

ఏం జరిగిందంటే!

ఈ సీజన్​లో అక్టోబర్​ 11న తొలిసారి రాజస్థాన్ రాయల్స్-సన్​రైజర్స్ హైదరాబాద్ తలపడగా రాజస్థాన్ విజయం సాధించింది. అపుడు "హేయ్ జొమాటో.. మేము ఒక లార్జ్ హైదరాబాద్ బిర్యానీ ఆర్డర్ చేయాలనుకుంటున్నాం. లొకేషన్: వన్ అండ్ ఓన్లీ రాయల్ మిరేజ్ రౌండ్" అంటూ ట్వీట్ చేసింది రాయల్స్.

తాజాగా గురువారం జరిగిన మ్యాచ్​లో రాజస్థాన్​పై సన్​రైజర్స్ విజయం సాధించింది. అపుడు 'బిర్యానీ ఆర్డర్ క్యాన్సిల్ చేయండి. మా స్నేహితులు మసాలా ఘాటును తట్టుకోలేరు. మీకు దాల్ బాటీ సరిపోతుంది" అంటూ బదులిచ్చింది సన్​రైజర్స్. దీంతో వీరి మధ్య జరిగిన ఈ పోటీని కొందరు అభిమానులు ఆస్వాదిస్తుండగా.. మరికొందరు ఇలాంటి ట్వీట్లు సరికాదంటూ చెబుతున్నారు.

Last Updated : Oct 23, 2020, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details