అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌పై రాజస్థాన్ రాయల్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్స్.. 18.2ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. స్టోక్స్(107) శతకంతో మెరవగా, సంజూ శాంసన్(54) అర్ధ శతకం బాది విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో దాదాపుగా ప్లే ఆప్స్ ఆశల్ని సజీవం చేసుకున్నట్లే! మిగతా వారు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో జేమ్స్ ప్యాటిన్స్న్ రెండు వికెట్లు తీశాడు.
ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం - ipl 2020 live updates
23:04 October 25
22:49 October 25
రాజస్థాన్ వికెట్లను కాపాడుకుంటూ ఆచితూచి ఆడుతోంది. దీంతో 16ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. క్రీజులో ఉన్న స్టోక్స్(86) ధాటిగా ఆడుతూ సెంచరీ దిశగా పయనిస్తోన్నాడు. శాంసన్(51) నిలకడగా ఆడుతోన్నాడు. విజయానికి 24 బంతుల్లో 24 పరుగులు అవసరం
22:41 October 25
రాహుల్ చాహర్ వేసిన 14వ ఓవర్‌లో రాజస్థాన్ 19 పరుగులు రాబట్టింది. స్టోక్స్(70) ఒక సిక్స్‌ర్ బాదగా, సంజూ(40) ఒక ఫోర్, ఒక సిక్సర్ బాదాడు. దీంతో 14 ఓవర్లకు రాజస్థాన్ స్కోర్ 144/2కి చేరింది.
22:18 October 25
పది ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది రాజస్థాన్. క్రీజులో బెన్స్టాక్స్(53) ధాటిగా ఆడగా.. సంజు శాంసన్(16) జాగ్రత్తగా ఆడుతోన్నాడు.
22:09 October 25
ఎనిమిది ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 75పరుగులు చేసింది రాయల్స్. క్రీజులో సంజు శాంసన్(4), స్టోక్స్(44) ఉన్నారు. 72 బంతుల్లో 121 పరుగులు అవసరం
21:43 October 25
ఛేదనను ధాటిగా ప్రారంభించిన రాజస్థాన్ జట్టు. దీంతో నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 41 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్, స్టోక్స్ ఉన్నారు. అంతకు ముందు 13 పరుగులు చేసిన ఉతప్ప.. పాటిన్సన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
21:10 October 25
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి.. రాజస్థాన్ రాయల్స్ ముందు 196 భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసింది. హార్దిక పాండ్య(60) టాప్ స్కోరర్. ఇషాన్ కిషన్(37), సూర్యకుమార్ యాదవ్(40), సౌరభ్ తివారీ(34) బాగానే రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో శ్రేయస్ గోపాల్(2), జోఫ్రా ఆర్చర్(2), కార్తీక్ త్యాగీ (1) వికెట్ తీశారు.
20:44 October 25
15 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి నాలుగు వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. క్రీజులో హార్దిక్ పాండ్యా(3) సౌరభ్ తివారీ(16) ఉన్నారు.
20:32 October 25
ఆచితూచి ఆడుతోన్న ముంబయిపై దెబ్బ కొట్టింది రాజస్థాన్. వెంటవెంటనే రెండు వికెట్లను పడగొట్టింది. కార్తీక్ త్యాగీ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(37) షాట్‌కు యత్నించి జోఫ్రా ఆర్ఛర్ చేతికి చిక్కాడు. మరోవైపు సూర్యకుమార్(40) పెవిలియన్ చేరాడు. దీంతో 12.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 95పరుగులు చేసింది రోహిత్ సేన. క్రీజులోకి కీరన్ పొలార్డ్, సౌరభ్ తివారీ వచ్చారు.
20:19 October 25
పది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(37), సూర్యకుమార్ యాదవ్(38) జాగ్రత్తగా ఆడుతోన్నారు.
20:11 October 25
ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబయి వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో ఇషాన్ కిషన్(27), సూర్యకుమార్ యాదవ్ (27) జాగ్రత్తగా ఆడుతోన్నారు.
19:55 October 25
ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది ముంబయి. క్రీజులో ఇషాన్ కిషన్ (19), సూర్యకుమార్ యాదవ్ (12) జాగ్రత్తగా ఆడుతోన్నారు.
19:36 October 25
తొలి ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది ముంబయి. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో నాలుగో బంతికి భారీ సిక్సర్ బాదిన క్వింటన్ డికాక్ (6; 4 బంతుల్లో 1×6) తర్వాతి బంతికి బౌల్డ్ అయ్యాడు. ఇషాన్ కిషన్ (1), సూర్యకుమార్ యాదవ్ (2) క్రీజులో ఉన్నారు.
19:15 October 25
తొడ కండరాల గాయం వల్ల చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌కు దూరమైన ముంబయి ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే ఈ మ్యాచ్‌లోనూ ఆడట్లేదు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే కీరన్ పొలార్డ్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు.
19:13 October 25
జట్ల వివరాలు
ముంబయి ఇండియన్స్ : క్వింటన్ డి కాక్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా, కీరోన్ పొలార్డ్ (సారథి), కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా
రాజస్థాన్ రాయల్స్ : రాబిన్ ఉతప్ప, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్, జాస్ బట్లర్, స్టీవ్ స్మిత్ (సారథి), రియాన్ పరాగ్, రాహుల్ తివాటియా, జోఫ్రా ఆర్చర్, శ్రేయాస్ గోపాల్, అంకిత్ రాజ్‌పూత్, కార్తీక్ త్యాగి
18:52 October 25
అబుదాబి వేదికగా ఈ రోజు మ్యాచ్ ముంబయి ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఆడిన పది మ్యాచుల్లో ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ముంబయి ఉండగా.. ఏడింటిలో ఓడి ఏడో స్థానంలో ఉంది రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్‌లో గెలిచి, జోరును కొనసాగించాలని రోహిత్ సేన, ప్లే ఆఫ్స్ అవకాశాలను పదిలం చేసుకోవాలని(కనీసం రన్‌రేట్‌ను మెరుగుపరుచుకోనైనా) స్మిత్ బృందం పట్టుదలతో ఉన్నాయి. మరి ఎవరు గెలుస్తోరో? అయితే టాస్ గెలిచి ముంబయి బ్యాటింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ బౌలింగ్ దాడి చేయనుంది.