రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ నెట్ సెషన్లో హెలికాప్టర్ షాట్‌ను ప్రాక్టీసు చేస్తున్నాడు. ఈ వీడియోను ట్విట్టర్లో షేర్ చేసిన రాయల్స్ యాజమాన్యం.."హెలికాప్టర్ షాట్ ఆడే కెప్టెన్‌ను ప్రేమించాలి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఇటీవలే జరిగిన మ్యాచ్‌లో 16 పరుగుల తేడాతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. స్టీవ్ స్మిత్ 47 బంతుల్లో 69 పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది.