తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీసేనపై​ రాజస్థాన్​ రాయల్స్​ సూపర్​ విక్టరీ - rajastahan royals csk match highlights

చెన్నై సూపర్​కింగ్స్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్​లో రాజస్థాన్​ రాయల్స్​ విజయం సాధించింది. చెన్నైపై పూర్తి ఆధిపత్యం వహించిన రాజస్థాన్.. 16 పరుగుల తేడాతో గెలిచింది.

Rajasthan Royals
రాజస్థాన్​ రాయల్స్​

By

Published : Sep 22, 2020, 11:47 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐపీఎల్ అభిమానులకు అసలైన మజా పంచింది. ప్రస్తుత సీజన్​లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రెచ్చిపోయింది. శాంసన్‌(74) మెరుపులు, స్మిత్(69) మాస్టర్ స్ట్రోక్​తో రాజస్థాన్‌ భారీ స్కోరు చేసింది.

తొలుత టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకోగా.. రాజస్థాన్ బ్యాటింగ్ దిగింది. ఈ సారి స్మిత్ తన కెరీర్‌లోనే తొలిసారిగా ఓపెనర్ అవతారం ఎత్తాడు. అయితే జైస్వాల్ రూపంలో తొలి వికెట్‌ను వెంటనే కోల్పోయినా.. వన్ డౌన్‌లో శాంసన్ వచ్చీ రావడంతోనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఎడాపెడా సిక్సులు బాదేశాడు. సంజూ(32 బంతుల్లో 74 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్‌కు స్టీవ్ స్మిత్(47 బంతుల్లో 69 పరుగులు) తోడవడం వల్ల రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. ఈ ఏడాది టోర్నీలోనే ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో తొలిసారి 200 పైగా స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. అయితే శాంసన్ తరువాత వరుసగా వికెట్లు కోల్పోయినా.. చివరి ఓవర్లో ఆర్చర్ సునామీ ఇన్నింగ్స్‌తో 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 216 పరుగులు చేసింది.

ఛేదనలో చెన్నై.. వికెట్ కోల్పోకుండా 53 పరుగులు చేసి పోటీలో ఉన్నట్లే అనిపించింది. మురళీ విజయ్ మళ్లీ నిరాశ పరుస్తూ 21 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి డీప్ స్క్వేర్‌లో గోపాల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత వాట్సన్ కొద్ది సేపు నిలబడినా తెవాటియా బౌలింగ్‌లో ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వికెట్లు పడుతున్నా డూప్లెసిస్ మాత్రం సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లో 72పరుగులు చేసి జట్టును పోటీలో ఉంచాడు. కానీ చివర్లో ఔటై నిరాశ మిగిల్చాడు. మిగతా ఆటగాళ్లు మాత్రం అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. చివర్లో ధోనీ మూడు వరుస సిక్సులు బాదినా అప్పటికే మ్యాచ్ చేజారిపోయింది. దీంతో 16 పరుగుల తేడాతో చెన్నైపై రాజస్థాన్ విజయ ఢంకా మోగించింది. పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details