ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ ఈ ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. అమూల్యమైన పరుగులు సాధిస్తూ ముంబయి విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన ఘనతనూ సాధించాడు డికాక్. లీగ్‌లో ముంబయి తరఫున వరుసగా మూడు అర్ధసెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
సచిన్ సరసన డికాక్.. వరుస అర్ధశతకాలతో జోరు - డికాక్ సచిన్ రికార్డు
ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ అరుదైన ఘనత సాధించాడు. ఆ జట్టు తరఫున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేసి దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ సరసన నిలిచాడు.
సచిన్ సరనస డికాక్.
ఇంతకుముందు సచిన్ తెందూల్కర్ 2010 సీజన్లో ముంబయి తరఫున వరుసగా మూడు హాఫ్ సెంచరీలు చేశాడు. పంజాబ్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన డికాక్ సచిన్ సరసన నిలిచాడు.
ఈ లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై (78*), దిల్లీ క్యాపిటల్స్‌పై (53) అర్ధశతకాలు సాధించాడు. ఈరోజు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ 53 పరుగులు చేశాడు.
Last Updated : Oct 19, 2020, 12:45 AM IST