తెలంగాణ

telangana

ETV Bharat / sports

అసలైన వినోదం ఉండేది అక్కడే: కోహ్లీ - కోహ్లీ ప్లేఆఫ్స్​

ప్లేఆఫ్స్​కు చేరడంపై హర్షం వ్యక్తం చేశాడు రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు జట్టు సారథి విరాట్​ కోహ్లీ. గత రెండు నెలల్లో ఆడిన మ్యాచ్​ల కన్నా.. ఎలిమినేటర్​ మ్యాచ్​లో ఎక్కువ వినోదాన్ని పొందుతారని అన్నాడు. ఈ పోరులో దూకుడుగా ఆడతామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు.

Virat Kohli
కోహ్లీ

By

Published : Nov 4, 2020, 10:14 PM IST

ఐపీఎల్​-13లో బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్​లో చోటు దక్కించుకుంది. ఈ నెల 6న జరగబోయే ఎలిమినేటర్​ మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​తో తలపడనుంది. తాజాగా దీనిని ఉద్దేశించి మాట్లాడాడు ఆ జట్టు సారథి కోహ్లీ. ప్లేఆఫ్స్​కు చేరడంపై హర్షం వ్యక్తం చేశాడు. గత రెండు నెలలో ఆడిన మ్యాచ్​ల కన్నా ఎలిమినేటర్​ మ్యాచ్​ మరింత వినోదాన్ని ఇస్తుందన్నాడు. ఈ పోరులో మరింత దూకుడుగా ఆడతామని ధీమా వ్యక్తం చేశాడు. దీంతోపాటే తమ జట్టులోని ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపాడు కోహ్లీ. ఈ మేరకు ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓ వీడియోను పోస్ట్​ చేసింది. ఇందులో కోహ్లీతో పాటు కోచ్​ సైమన్​ కటిచ్​ సహ పలువురు ఆటగాళ్లు మాట్లాడారు.

"అందరూ సానుకూల దృక్పథంతోనే ఉండాలని కోరుకుంటున్నాను. గత రెండున్నర నెలల కన్నా వచ్చే వారంలో జరగబోయే మ్యాచ్​ల​లో ఎక్కువ వినోదాన్ని పొందుతారని హామి ఇస్తున్నాను. ప్లేఆఫ్స్​కు చేరుకోవాడనికి చాలా కష్టపడ్డాం. బాగా ఆడతామని భావిస్తున్నా."

-కోహ్లీ, ఆర్సీబీ సారథి.

ఇదీ చూడండి'వాతావరణ మార్పులతో వికెట్లు తీయడం కష్టమే!'

ABOUT THE AUTHOR

...view details