తెలంగాణ

telangana

ETV Bharat / sports

గెలిచినా.. ఇంకా మెరుగవ్వాలి: ధోనీ

తొలి మ్యాచ్​లో తమ జట్టుకు అనేక సానుకూల అంశాలు ఎదురయ్యాయని అన్నాడు చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ. ముంబయిపై విజయం సాధించినప్పటికీ ఇంకా మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని మహీ అభిప్రాయపడ్డాడు.

Plenty of positives, but plenty of areas to improve: MS Dhoni
'ముంబయిపై గెలిచినా.. అనేక అంశాల్లో మెరుగవ్వాలి'

By

Published : Sep 20, 2020, 11:29 AM IST

Updated : Sep 25, 2020, 5:59 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​ (ఐపీఎల్​) 13వ సీజన్​లోని తొలి మ్యాచ్​లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబయి ఇండియన్స్​పై చెన్నై సూపర్​కింగ్స్​ విజయం సాధించింది. బ్యాటింగ్​, బౌలింగ్​ రెండు విభాగాల్లోనూ అద్భుత ప్రదర్శన చేసి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది సీఎస్కే. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన ధోనీ జట్టు ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.

టాస్ వేసిన తర్వాత అభివాదం చేసుకుంటున్న రోహిత్​, ధోనీ

"అంతా భిన్నంగా ఉంది. ఇది మ్యాచ్​ అనంతరం కార్యక్రమంలా అనిపించట్లేదు. చాలా సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగినా మేం ఆడిన తీరు సంతృప్తినిచ్చింది. ఈ పరిస్థితుల్లో ఎలా బౌలింగ్​ చేయాలో అర్థం చేసుకోవడానికి మేం కాస్త సమయం తీసుకున్నాం. ముంబయి బ్యాట్స్​మెన్​ బాగా ఆడి మాపై ఒత్తిడి తీసుకురాగలిగారు. మొత్తంగా ఈ మ్యాచ్​లో మాకు చాలా సానుకూలాంశాలు ఉన్నాయి. మాలో ఎక్కువమంది రిటైరైన వాళ్లే. అయినప్పటికీ వాళ్ల అనుభవం జట్టుకు, యువ ఆటగాళ్లకు పనికొస్తుంది."

- మహేంద్రసింగ్ ధోనీ, చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​

శనివారం జరిగిన మ్యాచ్​లో ముంబయిపై విజయంతో ఐపీఎల్​ కెరీర్​లో కెప్టెన్​గా వందో విజయాన్ని అందుకున్నాడు చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్​ మహేంద్రసింగ్​ ధోనీ.

ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ మాట్లాడుతూ.. తొలి మ్యాచ్​లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుని రాబోయే మ్యాచ్​లలో రాణిస్తామని తెలిపాడు. డుప్లెసిస్​, రాయుడులా తమ బ్యాట్స్​మెన్​ ప్రదర్శన చేయలేదని వెల్లడించాడు. "డుప్లెసిస్​, రాయుడు లాగా మా బ్యాట్స్​మెన్​ ఎవరూ ఆడలేదు. మొదటి 10 ఓవర్లలో మేం 85 పరుగులు చేశాం. చివర్లో సీఎస్కే బౌలర్లు ఎంతో చక్కగా బౌలింగ్​ చేశారు. టోర్నీ ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి ఈ మ్యాచ్​లో మేం చేసిన తప్పులను సరిదిద్దుకుని తర్వాతి మ్యాచ్​లో తెలివిగా రాణిస్తాం. పిచ్​లకు అనుగుణంగా మా జట్టులో మార్పులు జరగాల్సిన అవసరం ఉంది" అని అన్నాడు రోహిత్​ శర్మ.

Last Updated : Sep 25, 2020, 5:59 PM IST

ABOUT THE AUTHOR

...view details