తెలంగాణ

telangana

ETV Bharat / sports

'బౌలర్లు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది' - పొలార్డు స్పందన

రాజస్థాన్​ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్​లో పోరాడి ఓడిపోయామని ముంబయి ఇండియన్స్ కెప్టెన్​ కీరన్​ పొలార్డ్ అన్నాడు. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను కట్టడి చేసేందుకు తమ బౌలర్లు బాగా ప్రయత్నించారని పేర్కొన్నాడు. స్టోక్స్ మెరుపు ఇన్నింగ్స్​ను కొనియాడాడు.

POLLARD_MI
'బాగా ఆడినా.. హార్ధిక్​ ఓటమి వైపే నిలిచాడు'

By

Published : Oct 26, 2020, 9:00 AM IST

Updated : Oct 26, 2020, 9:13 AM IST

అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్​​ జట్టుతో తలపడ్డ ముంబయి ఇండియన్స్ అనూహ్యంగా ఓటమిపాలైంది. రాజస్థాన్​ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచినా గెలుపుని చేజిక్కించుకోలేకపోయింది. దీనిపై స్పందించిన ముంబయి జట్టు కెప్టెన్ కీరన్ పొలార్డ్.. బౌలర్లు బాగానే ప్రయత్నించారని.. కానీ దానికి ప్రతిఫలం భిన్నంగా వచ్చిందని వెల్లడించాడు.

" హార్ధిక్ బాగా ఆడాడు. బౌలర్లు బాగా ప్రయత్నించారు కానీ దానికి భిన్నమైన ఫలితం లభించింది. కానీ, రాజస్థాన్​ జట్టుకు గట్టి పోటీ ఇచ్చాం. స్టోక్స్- శాంసన్​ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు."

-కీరన్ పొలార్డ్, ముంబయి జట్టు సారథి.

రాజస్థాన్​ ముందు భారీ లక్ష్యాన్ని (195 పరుగులు) ఉంచినా ముంబయి ఓటమిపాలైంది. హార్ధిక్ 21 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టుకు పెద్ద స్కోరు అందించినా.. రాజస్థాన్ ఈ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. స్టోక్స్ 107, శాంసన్ పరుగులతో ఆకట్టుకున్నారు.

ఇదీ చదవండి:'స్టోక్స్, శాంసన్ బ్యాటింగ్​ను చూస్తూ ఉండిపోయా'

Last Updated : Oct 26, 2020, 9:13 AM IST

ABOUT THE AUTHOR

...view details