రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ మరోసారి నెటిజన్లకు చిక్కాడు. దీంతో అతడిపై ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా కోహ్లీ ఫోర్ కొట్టిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. దీంతో విమర్శల పాలయ్యాడు. అందులో తప్పేముంది అంటారా! అయితే అసలేం జరిగిందో చూడండి.
అసలేం జరిగింది!
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ కోహ్లీ 28 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఇందులో ఒకే ఒక్క ఫోర్ ఉంది. అది కూడా అతనాడిన 25వ బంతికి వచ్చింది. అయితే దాన్ని కూడా కోహ్లీ సెలబ్రేట్ చేసుకున్నాడు. దీంతో నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు.
"కోహ్లీ.. నువ్వు కొట్టింది ఒక్క ఫోర్. దానికి అంత సెలబ్రేషన్ అవసరమా?" అంటూ ఒకరు ట్రోల్ చేయగా, "డివిలియర్స్ అన్ని సిక్సులు, ఫోర్లు కొట్టాడు. అయినా సింపుల్‌గా ఉన్నాడు. మరి కోహ్లీ ఒక్క ఫోర్కే అంత రియాక్షన్ ఏంటి?" అంటూ మరొకరు కామెంట్ చేశారు. "ప్రసిద్ధ్ కృష్ణ వేసిన బంతి ఆఫ్ సైడ్ బయటకు వెళ్లడం వల్ల ఫోర్ వచ్చింది. ఇందులో కోహ్లీ సాధించిందేమీ లేదు" అంటూ మరో నెటిజన్ ట్రోల్ చేశాడు.