తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మరో దారి లేదు.. ట్రేడింగ్​ ద్వారానే తీసుకుంటాం' - ట్రేడింగ్​ విండో ద్వారా ఆటగాళ్లను

వచ్చే ఐపీఎల్​లో ట్రేడింగ్​ ద్వారా ఆటగాళ్లను కొనుగోలు చేస్తామని చెప్పాడు ముంబయి ఇండియన్స్​ హెడ్​ కోచ్​ జయవర్ధనే. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు.

jayavardhaney
జయవర్ధనే

By

Published : Nov 15, 2020, 10:20 AM IST

Updated : Nov 15, 2020, 10:29 AM IST

కరోనా కారణంగా వచ్చే ఐపీఎల్​లో ట్రేడింగ్ విండో​ ద్వారా ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటామని తెలిపాడు ముంబయి ఇండియన్స్​ హెడ్​ కోచ్​ మహేలా జయవర్ధనే. వచ్చే సీజన్​లోనూ తాము గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

"సాధారణమైన పద్ధతి ద్వారానే ప్రతిఏటా ప్రతిభ ఉన్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంటాం. కానీ ఈ సారి కారోనా కారణంగా మాకు అంత సమయం లేదు. కాబట్టి మిగతా ఫ్రాంచైజీలతో సంప్రదింపులు జరిపి ట్రేడింగ్​ ద్వారా ఆటగాళ్లను తీసుకోవచ్చు. మా జట్టు మరింత బలంగా తయారవ్వాలంటే మాకు మరో దారి లేదు.

-జయవర్ధనే, ముంబయి ఇండియన్స్​ హెడ్​కోచ్​.

ముంబయి జట్టు.. ఈ ఐపీఎల్​ ముందు వరకు బేసి​ సంఖ్య గల ఏడాదిలోనే విజయాలను సాధించింది. అయితే ఆ సంప్రదాయాన్ని చెరిపేయాలని ఈ సీజన్​ను ఓ సవాల్​గా తీసుకుని తాము ఆడినట్లు చెప్పాడు జయవర్ధనే. ఈ ఏడాది ఐపీఎల్​లో రోహిత్​ శర్మ సారథ్యంలోని ముంబయి ఇండియన్స్​ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో లీగ్​ చరిత్రలోనే అత్యధికంగా ఐదు సార్లు కప్​ను గెలుచుకున్న ఏకైక జట్టుగా నిలిచింది.

ఇదీ చూడండి : 'టీ20 ప్రపంచకప్​నైనా ముంబయి గెలిచేస్తుంది'

Last Updated : Nov 15, 2020, 10:29 AM IST

ABOUT THE AUTHOR

...view details