తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​: ముంబయి వేగాన్ని రాయల్స్​ ఆపగలదా? - ఐపీఎల్​ 13 అప్​డేట్స్​

ముంబయి ఇండియన్స్​-రాజస్థాన్​ రాయల్స్​ జట్ల మధ్య అబుదాబి​ వేదికగా నేడు(మంగళవారం) మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. విజయంపై ఇరుజట్లు ధీమాగా ఉన్నాయి.

Mumbai indians vs Rajasthan Royals
ఐపీఎల్​ 13

By

Published : Oct 6, 2020, 5:25 AM IST

మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ముంబయి ఇండియన్స్​-రాజస్థాన్​ రాయల్స్​ మధ్య అబుదాబి​ వేదికగా మంగళవారం మ్యాచ్​ జరగనుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్​లు ఆడి మూడింటిలో విజయం సాధించిన ముంబయి.. పాయింట్ల పట్టికలో ముందంజలో ఉంది. మరోవైపు ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండింటిలో ఓడి.. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది రాజస్థాన్. ఇప్పుడీ రెండు జట్లు తలపడటానికి సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

జోరు ఇలానే కొనసాగిస్తుందా?

ముంబయి ఇండియన్స్​ ఓటమితో లీగ్ ప్రారంభించినా.. ఆ తర్వాత ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింటిలో ఘనవిజయం సాధించింది. గత రెండు మ్యాచుల్లో వరుసగా విజయాల్ని ఖాతాలో వేసుకుని గెలుపు గుర్రం మీద సవారీ చేస్తోంది. ఇదే జోష్​తో రాయల్స్​తో తలపడడానికి సిద్ధమైంది. అయితే ముంబయి జట్టులో సారథి రోహిత్, కీరన్​ పొలార్డ్​, డికాక్, ఇషాన్ కిషన్​, హార్దిక్​ పాండ్యా, కృనాల్​ మిశ్రమ ప్రదర్శనను కనబరుస్తున్నారనే చెప్పాలి. ఓ మ్యాచ్​లో దంచికొడితే మరో మ్యాచ్​లో తేలిపోతున్నారు. ఏదేమైనప్పటికీ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో వీరు చెలరేగిపోతే ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలనే చెప్పాలి. ఇక బౌలర్లు బుమ్రా, జేమ్స్​ ప్యాటిన్సన్​, బౌల్ట్​ అండ జట్టుకు ఉండనే ఉంది. అయితే హార్దిక్​ బౌలింగ్​ వేయడం ప్రారంభిస్తే మాత్రం జట్టుకు మరింత బలం చేకూరే అవకాశముంది.

విజయమా, ఓటమా?

రాజస్థాన్​ రాయల్స్​ ఆరంభంలోనే తొలి రెండు మ్యాచుల్లో గెలిచి క్రీడాభిమానులకు అసలైన ఐపీఎల్​ మజా పంచింది. కానీ అనంతరం ఆడిన రెండు మ్యాచుల్లో పరాజయాల పరంపర కొనసాగించింది. ఎన్నో అంచనాలతో బరిలో దిగిన జాస్​ బట్లర్​ అభిమానులను నిరాశపరుస్తున్నాడు. జయదేవ్​ ఉనద్కత్​, యువ ఆటగాడు రియాన్​ పరాగ్​ కూడా పేలవ ప్రదర్శన చేస్తున్నారు. కాగా, సారథి స్మిత్​, తెవాతియా, సంజూ శాంసన్​ ధనాధన్​ ఇన్నింగ్స్​తో మెరిసినా ఫలితం దక్కట్లేదు. తొలి రెండు మ్యాచుల్లో వీరి అండ వల్లే రాజస్థాన్​ విజయాన్ని దక్కించుకుంది. కాబట్టి ముంబయితో జరిగే మ్యాచ్​లో కొన్ని మార్పులు చేసుకుని సమష్టిగా రాణిస్తేనే తప్ప గెలవడం కష్టమనే చెప్పాలి.

జట్ల అంచనాలు

రాజస్థాన్

బట్లర్, స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, రాబిన్ ఉతప్ప, రాహుల్ తెవాతియా, రియాన్ పరాగ్, టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, అంకిత్ రాజ్​పుత్

ముంబయి

డికాక్, రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కీరన్ పొలార్డ్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, జేమ్స్ ప్యాటిన్సన్, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details