కెప్టెన్ ధోనీతో 22 గజాల క్రికెట్ మైదానాన్ని పంచుకోవడం తాను కన్న కల కంటే ఎక్కువని చెన్నై సూపర్‌కింగ్స్ బ్యాట్స్‌మన్ రుతురాజ్ గైక్వాడ్ అంటున్నాడు. ప్రసుత ఐపీఎల్ సీజన్ ముగిసిన క్రమంలో ధోనీని ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్‌లో రుతురాజ్ ఓ పోస్ట్ పెట్టాడు.
"2016 అక్టోబరులో నా తొలి రంజీ మ్యాచ్ సందర్భంగా ధోనీని మొదటిసారిగా కలిశాను. అతడు ఝార్ఖండ్‌కు గురువు. 'ఎలా ఉన్నావు' అని అడిగాడు. అదే నెల (అక్టోబరు) 2020లో స్వయంగా వచ్చి నాతో మాట్లాడాడు. డ్రెస్సింగ్ రూమ్‌ను ధోనీతో కలిసి పంచుకోవడం నాకు దక్కిన అదృష్టం. 22 గజాలను అతనితో పంచుకోవడం చాలా బాగుంది. నేను కన్న కల కంటే చాలా గొప్పగా జరిగింది".