తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లేఆఫ్స్​లో దిల్లీకి చోటు కష్టమే: సంగక్కర - ఐపీఎల్ తాజా వార్తలు

యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ ప్లేఆఫ్స్​లో దిల్లీ చోటు దక్కించుకునే విషయం తనకు అనుమానంగా ఉందని లంక మాజీ ఆటగాడు సంగక్కర అన్నాడు. ఆ జట్టు టాపార్డర్ విఫల ప్రదర్శన చేస్తుందని తెలిపాడు.

Misfiring top order could cost Delhi Capitals a playoff spot: Sangakkara
ఫ్లేఆఫ్స్​లో దిల్లీకి చోటు కష్టమే!: సంగక్కర

By

Published : Oct 31, 2020, 5:27 PM IST

ఐపీఎల్​ తొలి భాగంలో అదరగొట్టి, గత కొన్ని మ్యాచ్​ల్లో ఓడిపోతున్న దిల్లీ క్యాపిటల్స్​పై శ్రీలంక మాజీ క్రికెటర్ సంగక్కర ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ జట్టు ప్లేఆఫ్స్​ చేరుతుందో లేదో అని తనకు అనుమానంగా ఉందని అన్నాడు. వాళ్ల టాపార్డర్​ విఫలమవుతుండటమే ఇందుకు కారణమని అభిప్రాయపడ్డాడు. ముంబయి, బెంగళూరు ప్లేఆఫ్స్​కు చేరుకుంటాయని వెల్లడించాడు. పంజాబ్ కూడా వెళ్లే అవకాశముందని చెప్పాడు.

శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర

14 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో ఉన్న దిల్లీ.. గత మూడు మ్యాచ్​ల్లో ఓడి, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ముంబయి, బెంగళూరుతో మ్యాచ్​ల్లో కచ్చితంగా గెలివాల్సిన పరిస్థితి. ఇందులో గెలిస్తేనే క్వాలిఫయర్స్​కు ఈ జట్టు అర్హత సాధిస్తుంది. లేదంటే కష్టమే!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details