తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​కు పెద్ద దెబ్బ.. మార్ష్ ఆడటం కష్టమే!

ఐపీఎల్​లో​ తర్వాత ఆడబోయే మ్యాచ్​లకు ఆల్​రౌండర్​ మిచెల్​ మార్ష్​ అందుబాటులో ఉండకపోవచ్చని సన్​రైజర్స్ హైదరాబాద్ వర్గాలు అంటున్నాయి. కాలి కండరం తీవ్రంగా బాధిస్తున్న కారణంగా మార్ష్ తర్వాతి మ్యాచ్​లు ఆడే విషయమై స్పష్టత లేదని తెలిపాయి.​

Marsh may be ruled out of entire IPL due to ankle injury: Sources
ఐపీఎల్​: మిచెల్​ మార్ష్​ ఆడటం కష్టమే!

By

Published : Sep 22, 2020, 2:36 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

ఐపీఎల్​లో సోమవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్​ ఆల్​రౌండర్​ మిచెల్​ మార్ష్​ గాయపడ్డాడు. ఈ కారణంగా తన తర్వాతి మ్యాచ్​లకు అందుబాటులో ఉండకపోవచ్చని ఆ జట్టు వర్గాలు అంటున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు.

ఓవర్​ పూర్తి చేయకుండానే..

కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ ఇచ్చిన ఓవర్​ను పూర్తి చేయకుండా కేవలం నాలుగు బంతులు వేసి నిష్క్రమించాడు మార్ష్. ఐదో ఓవర్​లో ఆరోన్​ ఫించ్​ కొట్టిన బంతిని ఆపే క్రమంలో మార్ష్​ కాలి కండరం పట్టేసింది. నొప్పి తీవ్రతరం కావడం వల్ల తాను వేసే ఓవర్​లో రెండు బంతులు మిగిలి ఉండగానే మైదానాన్ని వీడాడు మార్ష్.

నొప్పిలోనూ బ్యాటింగ్​కు

ఆ తర్వాత ఛేదనలో 10వ స్థానంలో మిచెల్​ మార్ష్​ బ్యాటింగ్​కు దిగినా.. క్రీజ్​లో అతడు నిలబడటమే కష్టంగా మారింది. చివరికి ఆర్సీబీపై పది పరుగుల తేడాతో సన్​రైజర్స్​ ఓడిపోయింది. మార్ష్​ కాలి నొప్పితో మ్యాచ్​ నుంచి వెనుదిరగడం పట్ల సన్​రైజర్స్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ స్పందించాడు. కాలి కండరం బాధిస్తున్నా.. మార్ష్​ బ్యాటింగ్​ చేయడానికి వచ్చాడని కొనియాడాడు.

క్రిస్టియన్​ లేదా నబీ ఆడే అవకాశం!

ఒకవేళ మిచెల్ మార్ష్​ ఆడటం కష్టమైతే సన్​రైజర్స్​ జట్టుకు ఇది పెద్ద నష్టంగా మారుతుంది. మిచెల్​ స్థానంలో అనుభవజ్ఞుడైన క్రిస్టియన్​ లేదా ప్రపంచ టీ20 నంబర్​వన్​ ఆల్​రౌండర్​ మహ్మద్​ నబీని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details