రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తమకు కఠినమైన ప్రత్యర్థి అని అభిప్రాయపడ్డాడు రాజస్థాన్ రాయల్స్ బౌలర్ శ్రేయస్ గోపాల్. శనివారం ఇరు జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ అద్భుతంగా సాగుబోతుందని.. ఆర్సీబీతో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించాడు.
"ఆర్సీబీ మంచి జట్టుతో పాటు కఠినమైన ప్రత్యర్థి కూడా. ఈ ఏడాది ఐపీఎల్లో ఆర్సీబీ మంచి ఆరంభాన్నిచ్చింది. ఇక మీదట కచ్చితంగా రాణిస్తారని భావిస్తున్నా. శనివారం ఆర్సీబీతో జరిగే మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ మ్యాచ్ బ్యాట్, బంతికి మధ్య గొప్ప పోటీగా నిలవనుంది. ఈ మ్యాచ్‌తో టోర్నీలో మా జట్టు మూడో విజయాన్ని నమోదు చేస్తుందని నమ్ముతున్నా".