తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్ ఫైనల్లో ఆ రెండు జట్లు! - యువరాజ్ సింగ్ పంజాబ్

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఈసారి ఐపీఎల్ ఫైనల్లో తలపడే జట్లేవో వెల్లడించాడు. పంజాబ్-ముంబయి మధ్య జరిగిన ఉత్కంఠ పోరును ఉద్దేశించి ఈ ట్వీట్ చేశాడు.

KXIP will play the final against DC or MI says Yuvraj Singh
ఐపీఎల్ ఫైనల్లో ఆ రెండు జట్లు!

By

Published : Oct 19, 2020, 11:21 AM IST

ఆదివారం ముంబయి ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్​ ఉత్కంఠకు దారితీసింది. క్రికెట్ చరిత్రలో ఒక మ్యాచ్​లో రెండు సూపర్ ఓవర్లతో ఫలితం తేలింది. ఎలాగైనా గెలవాలన్న కసితో ఆడిన పంజాబ్.. ముంబయికి షాక్​ ఇచ్చింది. ఈ క్రమంలో టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ముంబయితో మ్యాచ్​లో పోరాట స్ఫూర్తిని కనబర్చిన పంజాబ్​ ఈసారి ఫైనల్​కు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"ఈరోజు గేమ్ ఛేంజర్​గా నికోలస్ పూరన్ నిలుస్తాడు. తన బ్యాటింగ్ చూడటం అద్భుతంగా ఉంది. నా అంచనా ప్రకారం పంజాబ్ ఈసారి ప్లే ఆఫ్స్ చేరుకుంటుంది. ఫైనల్లో ముంబయి లేక దిల్లీతో తలపడుతుంది."

-యువరాజ్ సింగ్, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఈ మ్యాచ్​లో తొలుత జరిగిన సూపర్‌ ఓవర్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి పంజాబ్‌ను అయిదు పరుగు‌లకే కట్టడి చేశాడు. అనంతరం షమీ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడం వల్ల ముంబయి సరిగ్గా అయిదు పరుగులే చేసింది. ఆఖరి బంతికి డికాక్‌ రెండో పరుగు కోసం ప్రయత్నించి రనౌటయ్యాడు. అనంతరం మరో సూపర్‌ ఓవర్‌లో.. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి.. వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. తర్వాత బరిలోకి దిగిన గేల్‌, మయాంక్‌ లక్ష్యాన్ని మరో రెండు బంతులుండగానే ఛేదించి జట్టును విజయతీరాలకు చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details