అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నాలుగు వికెట్లకు 185 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఆరంభంలో లైఫ్ లభించిన క్రిస్ గేల్ (99) విధ్వంసం సృష్టించాడు. అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ 17.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. బెన్ స్టోక్స్ (50), సంజు శాంసన్ (48) మెరుపు ఇన్నింగ్స్‌లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
పంజాబ్‌పై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం - ఐపీఎల్ వార్తలు
23:25 October 30
22:40 October 30
15 ఓవర్లు పూర్తయ్యేసరికి మూడు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది రాజస్థాన్. క్రీజులో బట్లర్, స్మిత్ ఉన్నారు. విజయానికి మరో 42 బంతుల్లో 54 పరుగులు కావాలి.
22:20 October 30
ధనాధన్ బ్యాటింగ్ చేస్తున్న రాజస్థాన్ రాయల్స్.. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. క్రీజులో సంజూ శాంసన్, ఉతప్ప ఉన్నారు. విజయానికి 60 బంతుల్లో 83 పరుగులు కావాలి.
21:56 October 30
186 పరుగుల ఛేదనను ధాటిగా మొదలుపెట్టింది రాజస్థాన్ జట్టు. 5 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్లేమి నష్టపోకుండా 54 పరుగులు చేసింది. క్రీజులో స్టోక్స్, ఉతప్ప ఉన్నారు.
21:11 October 30
గేల్(99) ధనాధన్ ఇన్నింగ్స్‌తో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది పంజాబ్. గేల్‌కు సహకారమందించిన కేఎల్ రాహుల్ 46 పరుగులు చేసి జట్టు భారీ స్కోరు చేయంలో సహాయపడ్డాడు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్, స్టోక్స్ తలో రెండు వికెట్లు తీశారు.
20:45 October 30
ధాటిగా బ్యాటింగ్ చేస్తున్న పంజాబ్.. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. క్రీజులో గేల్, పూరన్ ఉన్నారు. అంతకు ముందు 46 పరుగులు చేసిన రాహుల్.. స్టోక్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
19:49 October 30
బ్యాటింగ్‌ను నెమ్మదిగా ప్రారంభించిన పంజాబ్.. నాలుగు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. క్రీజులో గేల్, కేఎల్ రాహుల్ ఉన్నారు. అంతకు ముందు ఆర్చర్ బౌలింగ్‌లో ఓపెనర్ మన్దీప్ సింగ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
19:01 October 30
టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించనుంది పంజాబ్.
జట్లు:
పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్దీప్ సింగ్, గేల్, పూరన్, మ్యాక్స్‌వెల్, దీపక్ హుడా, జోర్డాన్, మురగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, షమి, అర్షదీప్ సింగ్
రాజస్థాన్:ఉతప్ప, స్టోక్స్, స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, బట్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, ఆర్చర్, శ్రేయస్ గోపాల్, వరుణ్ అరోన్, కార్తిక్ త్యాగి
18:35 October 30
హోరాహోరీ పోరుకు సిద్ధమైన ఇరుజట్లు
అబుదాబి వేదికగా పంజాబ్- రాజస్థాన్ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. ఇందులో పంజాబ్ గెలిస్తే.. ఫ్లేఆఫ్స్ రేసులో ముందుకెళ్తుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు మ్యాచ్ ప్రారంభం కానుంది.