తెలంగాణ

telangana

ETV Bharat / sports

చివరివరకు ఉత్కంఠ.. పంజాబ్​పై కోల్​కతా విక్టరీ - కోల్​కతా vs పంజాబ్ మ్యాచ్ అప్డేట్స్

KXIP vs KKR, IPL 2020 Match Day Live
పంజాబ్ వర్సెస్ కోల్​కతా మ్యాచ్

By

Published : Oct 10, 2020, 2:49 PM IST

Updated : Oct 10, 2020, 7:28 PM IST

19:13 October 10

అబుదాబిలో జరిగిన మ్యాచ్​లో పంజాబ్​పై కోల్​కతాపై 2 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(74), మయాంక్ అగర్వాల్(56) బ్యాటింగ్ వృథా అయింది. కోల్​కతా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, నరైన్ 2 వికెట్లు​ తీశారు.

అంతకు ముందు బ్యాటింగ్ చేసిన కోల్​కతా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58) ధనాధన్ ఇన్నింగ్స్​తో పాటు శుభ్​మన్(57) బ్యాట్​తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.

18:55 October 10

పంజాబ్ జట్టు బ్యాట్స్​మెన్ దూకుడుగా ఆడుతున్నారు. కెప్టెన్ కేఎల్ రాహుల్.. బ్యాట్​తో అదరగొడుతూ స్కోరు బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టిస్తున్నాడు. ప్రస్తుతం 16 ఓవర్లకు వికెట్ నష్టపోయి 136 పరుగులు చేసింది పంజాబ్. విజయానికి మరో 29 పరుగులు కావాలి.

18:25 October 10

10 ఓవర్లుకు పంజాబ్​ 76/0

పది ఓవర్లకు వికెట్​ కోల్పోకుండా కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ జట్టు 76 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో కేఎల్​ రాహుల్​(41), మయాంక్​ అగర్వాల్​(34) ఉన్నారు. 

18:18 October 10

8 ఓవర్లుకు పంజాబ్​ 62/0

ఎనిమిది ఓవర్లకు వికెట్​ కోల్పోకుండా కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ జట్టు 62 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్​లో కేఎల్​ రాహుల్​(32), మయాంక్​ అగర్వాల్​(30) ఉన్నారు. 

17:54 October 10

165 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ నెమ్మదిగా ఆడుతోంది. కేెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ మెల్లగా బ్యాటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం 4 ఓవర్లకు వికెట్లేమి నష్టపోకుండా 28 పరుగులు చేశారు.

17:18 October 10

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58), శుభ్​మన్ గిల్(57) ఆకట్టుకున్నారు. మిగిలిన బ్యాట్స్​మెన్ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

17:02 October 10

కోల్​కతా కెప్టెన్ దినేశ్ కార్తిక్ ధాటిగా ఆడుతున్నాడు. 22 బంతుల్లో అర్థశతకం పూర్తి చేశాడు. మరోవైపు 57 పరుగులు చేసిన శుభ్​మన్ రనౌట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 18 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసిందీ జట్టు.

16:47 October 10

15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్. క్రీజులో శుభ్​మన్ గిల్, దినేశ్ కార్తిక్ ఉన్నారు.

16:24 October 10

కోల్​కతా నైట్​రైడర్స్ బ్యాట్స్​మెన్ శుభ్​మన్, మోర్గాన్ నిలకడగా ఆడుతున్నారు. దీంతో 10 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసిందీ జట్టు.

15:57 October 10

బ్యాట్స్​మెన్ పొరపాటు వల్ల కోల్​కతా ఆటగాడు నితీశ్ రానా ఔటయ్యాడు. ప్రస్తుతం 5 ఓవర్లకు 19 పరుగులు చేసింది. క్రీజులో శుభ్​మన్, మోర్గాన్ ఉన్నారు.

15:43 October 10

షమి దెబ్బకు త్రిపాఠి పెవిలియన్​కు

గత మ్యాచ్ హీరో రాహుల్ త్రిపాఠి 4 పరుగులే చేసి షమి బౌలింగ్​లో ఔటయ్యాడు. ప్రస్తుతం 3 ఓవర్లకు 13/1తో ఉంది కోల్​కతా జట్టు. క్రీజులో శుభ్​మన్, నితీశ్ రానా ఉన్నారు.

15:00 October 10

టాస్ గెలిచిన కోల్​కతా నైట్​రైడర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ బౌలింగ్​ చేయనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్​కతా నాలుగో, పంజాబ్ ఎనిమిదో స్థానాల్లో ఉన్నాయి.

జట్లు

కోల్​కతా నైట్​రైడర్స్:రాహుల్ త్రిపాఠి, శుభ్​మన్ గిల్, నితీశ్ రానా, సునీల్ నరైన్, మోర్గాన్, రసెల్, దినేశ్ కార్తిక్(కెప్టెన్), కమిన్స్, నాగర్​కోటి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మయాంక్ అగర్వాల్, మన్​దీప్ సింగ్, పూరన్, సిమ్రన్ సింగ్, మ్యాక్స్​వెల్, ముజీబ్ ఉర్ రెహమాన్, జోర్డాన్, రవి బిష్ణోయ్, షమి, అర్షదీప్ సింగ్

14:34 October 10

గెలిచేది ఎవరు? కోల్​కతా లేదా పంజాబ్​?

అబుదాబి వేదికగా కోల్​కతా నైట్​రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. గత మ్యాచ్​లో గెలిచి ఊపు మీదున్న కోల్​కతా.. వరుస ఓటములతో డీలా పడిపోతున్న పంజాబ్ జట్లు.. విజయం దక్కించుకోవాలని పక్క ప్రణాళికలు వేసుకుంటున్నాయి.

Last Updated : Oct 10, 2020, 7:28 PM IST

ABOUT THE AUTHOR

...view details