తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఓపెనర్లు అదరహో.. పంజాబ్​పై చెన్నై ఘనవిజయం - చెన్నై Vs పంజాబ్​ ఐపీఎల్ వార్తలు

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్​కింగ్స్​ జట్టు సత్తా చాటింది. పంజాబ్​ జట్టుపై ధోనీసేన 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే ఓపెనర్లు అద్భుతమైన భాగస్వామ్యంతో జట్టుకు అలవోక విజయాన్ని అందించారు.

Chennai Super Kings thump Kings XI Punjab by 10 wickets
ఓపెనర్లు అదరహో.. పంజాబ్​పై చెన్నై విజయం

By

Published : Oct 4, 2020, 11:30 PM IST

ఐపీఎల్​లో కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​, చెన్నై సూపర్​కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్​లో ధోనీసేన 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సీఎస్కే ఓపెనర్లు షేన్​ వాట్సన్ (83; 53 బంతుల్లో 11x4, 6x3)​, ఫాఫ్​ డుప్లెసిస్ (87; 53 బంతుల్లో 11x4, 1x6)​లు అద్భుతమైన బ్యాటింగ్​తో జట్టుకు గెలుపును అందించారు. మరో 14 బంతులు మిగిలుండగానే ఒక్క వికెట్​ కూడా నష్టపోకుండా 179 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించారు.

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (63; 52 బంతుల్లో 7x4, 1x6), మయాంక్‌ అగర్వాల్‌ (26; 19 బంతుల్లో 3x4) మరోసారి శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించారు. ఈ క్రమంలోనే ధాటిగా ఆడబోయిన మయాంక్‌.. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో ఔటయ్యాడు. బౌండరీ వద్ద సామ్‌కరన్‌ చేతికి చిక్కడం వల్ల పంజాబ్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. ఆపై మన్‌దీప్‌ సింగ్‌తో (27; 16 బంతుల్లో 2x6) జోడీ కట్టిన రాహుల్‌ వేగంగా పరుగులు చేశాడు. 94 పరుగుల వద్ద మన్‌దీప్‌.. జడేజా బౌలింగ్‌లో రాయుడు చేతికి చిక్కి రెండో వికెట్​గా వెనుదిరిగాడు.

తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్‌ (33; 17 బంతుల్లో 1x4, 3x6) మెరుపు బ్యాటింగ్‌ చేశాడు. ఈ క్రమంలోనే రాహుల్‌ మరో అర్ధశతకం సాధించాడు. ఆపై జట్టు స్కోర్‌ 152 పరుగుల వద్ద పూరన్‌, రాహుల్‌ వరుస బంతుల్లో ఔటయ్యారు. శార్దుల్‌ ఠాకుర్‌ వేసిన 18వ ఓవర్‌ తొలి రెండు బంతులకు వారిద్దరూ పెవిలియన్‌ చేరారు. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌ (11), సర్ఫరాజ్‌ ఖాన్‌ (14) చివరి వరకూ క్రీజులో ఉండి చెన్నై ముందు 179 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. చెన్నై బౌలర్లలో శార్దుల్‌ ఠాకుర్‌ రెండు వికెట్లు తీయగా.. జడేజా, చావ్లా చెరో వికెట్‌ తీశారు.

ABOUT THE AUTHOR

...view details