తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధోనీ తీరుపై మాజీ కెప్టెన్​ శ్రీకాంత్​ ఆగ్రహం - కృష్ణమాచారి శ్రీకాంత్​ వార్తలు

జట్టులో ఉన్న యువకులకు కాకుండా.. పేలవ ప్రదర్శన చేస్తోన్న జాదవ్​, చావ్లాలకు ధోనీ వరుస అవకాశాలు ఇవ్వడంపై టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కృష్ణమాచారి​ శ్రీకాంత్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుత సీజన్​లో సీఎస్కే తుదిజట్టు ఎంపిక అత్యంత చెత్తగా ఉందని అసహనం వ్యక్తం చేశాడు.

Kris Srikkanth slams MS Dhoni: 'What spark did you see in Kedar Jadhav and Piyush Chawla?'
ధోనీ తీరుపై మాజీ కెప్టెన్​ శ్రీకాంత్​ ఆగ్రహం

By

Published : Oct 20, 2020, 1:24 PM IST

ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో చెన్నై సూపర్​కింగ్స్​ కెప్టెన్ మహేంద్రసింగ్​ ధోనీ తీరు సరిగా లేదని టీమ్​ఇండియా సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్ కృష్ణమాచారి శ్రీకాంత్​ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీలో సీఎస్కే తుదిజట్టు ఎంపిక అత్యంత చెత్తగా ఉందని తెలిపాడు. ​పేలవ ప్రదర్శనతో ఆకట్టుకోలేకపోతున్న పియూష్​ చావ్లా, కేదార్​ జాదవ్​లను ప్రతి మ్యాచ్​లో ఎంపిక చేయడంపై శ్రీకాంత్​ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మైదానంలో చురుగ్గా తిరగడానికి వాళ్లిద్దరికీ ఓ స్కూటర్​ అవసరమని ఎద్దేవా చేశాడు.

"ధోనీ నిర్ణయంతో నేను ఏకీభవించను. తుదిజట్టు ఎంపిక అర్ధ రహితంగా ఉంది. ప్రస్తుత టోర్నీలో తమ జట్టుకు కలిసి రావడం లేదని ధోనీ చెప్తున్నాడు. కానీ, ఆటగాళ్ల ఎంపికలోనే పెద్ద తప్పు ఉంది. ధోనీ ఒప్పందం ఏమిటి? జగదీశన్​లో మెరుపు లేదని అన్నాడు. కానీ, 'స్కూటర్​' జాదవ్​లో ఆ మెరుపు ఉందా? ఇది అత్యంత హాస్యాస్పదంగా ఉంది. దానికి నేను అంగీకరించను. దీనిపై చర్చ జరిగేలోపు టోర్నీ కూడా ముగిసిపోతుంది. ధోనీకి ఇప్పుడు ఒత్తిడి తగ్గిందని.. ఇకపై యువకులకు అవకాశం ఇస్తానని చెప్తున్నాడు. ఇలాంటి మాటలు నాకు అర్థం కావడం లేదు. కరన్​ శర్మ కనీసం రెండు వికెట్లు అయినా పడగొట్టాడు. కానీ, మ్యాచ్​ ఓడిపోయిన తర్వాత బౌలింగ్​ వేయడానికి పియూష్​ చావ్లా వస్తాడు. ధోనీ గొప్పవాడు కావొచ్చు. అలా అనడంలో సందేహమూ లేదు. కానీ, ఇలాంటి చర్యలతో నేను ఏకీభవించను."

- శ్రీకాంత్​, టీమ్​ఇండియా మాజీ క్రికెటర్

ఐపీఎల్​ ఆరంభ టోర్నీలో చెన్నై సూపర్​కింగ్స్​ ఫ్రాంచైజీకి బ్రాండ్​ అంబాసిడర్​గా​ వ్యవహరించాడు శ్రీకాంత్. ప్రస్తుత ఐపీఎల్​లో సీఎస్కే జట్టులో యువకులకు సరైన అవకాశం ఇవ్వడం లేదని క్రిస్​ శ్రీకాంత్​ అభిప్రాయపడ్డాడు. టోర్నీ మొత్తంలో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరుతో ఒకే ఒక్క మ్యాచ్​ ఆడిన జగదీశన్​ 33 పరుగులు చేయగా.. టోర్నీలో 8 మ్యాచ్​లు ఆడిన కేదార్​ జాదవ్​ కేవలం 62 రన్స్​ నమోదు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details