తెలంగాణ

telangana

ETV Bharat / sports

అదరగొట్టిన దిల్లీ.. మోర్గాన్‌ పోరాటం వృథా - ఐపీఎల్​ 2020 లైవ్​ అప్​డేట్స్​

కోల్​కతా నైట్​ రైడర్స్​పై దిల్లీ క్యాపిటల్స్​ 18 పరుగులు తేడాతో గెలిచింది. 229 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన కోల్​కతా 8 వికెట్లు కోల్పోయి 210కే పరిమితమైంది. దిల్లీ బౌలర్లలో అన్రిచ్‌ నోర్జే(3), హర్ష పటేల్​(2), కగిసొ రబడా, అమిత్​ మిశ్రా, స్టొయినిస్​ తలో వికెట్​ తీశారు. దిల్లీ విజయంలో సారథిశ్రేయస్‌ అయ్యర్‌ (88), పృథ్వీ షా(66), పంత్​(38) కీలక పాత్ర పోషించారు.

delhi
దిల్లీ

By

Published : Oct 4, 2020, 12:01 AM IST

Updated : Oct 4, 2020, 12:13 AM IST

షార్జా వేదికగా జరిగిన మ్యాచ్​లో కోల్​కతా నైట్​ రైడర్స్​పై దిల్లీ క్యాపిటల్స్​ 18 పరుగులు తేడాతో గెలిచింది. 229 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన కోల్​కతా 8 వికెట్లు కోల్పోయి 210కే పరిమితమైంది. నితీశ్‌ రాణా(58: 35 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకంతో రాణించగా.. ఆఖర్లో ఇయాన్‌ మోర్గాన్‌(44 :18 బంతుల్లో ఒక ఫోర్‌, 5సిక్సర్లు), రాహుల్‌ త్రిపాఠి(36: 16 బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సర్లు) మెరుపులు మెరిపించినా గెలిపించలేకపోయారు. బౌలర్లు నోర్ట్జే(3/33), హర్షల్‌ పటేల్‌(2/34) సహకరించడం వల్ల దిల్లీ విజయాన్ని అందుకుంది. మిగతా బౌలర్లు కగిసొ రబడా, అమిత్​ మిశ్రా, స్టొయినిస్​ తలో వికెట్​ తీశారు. దిల్లీ విజయంలో సారథిశ్రేయస్‌ అయ్యర్‌ (88), పృథ్వీ షా(66), పంత్​(38) కీలక పాత్ర పోషించారు.

భారీ ఛేదనకు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్‌ సునీల్‌ నరైన్‌(3) మరోసారి నిరాశపరిచాడు. తర్వాత శుభ్‌మన్‌ గిల్‌(28), నితీశ్‌ రాణా(58) రాణించడం వల్ల ఇన్నింగ్స్‌ గాడిలో పడింది. ఈ క్రమంలోనే వారిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. ఆపై రసెల్‌(13), దినేశ్‌ కార్తీక్‌(6) సైతం విఫలమయ్యారు. ఈ క్రమంలో జోడీ కట్టిన మోర్గాన్‌, రాహుల్‌ మెరుపు బ్యాటింగ్‌ చేశారు. వీరిద్దరూ చివర్లో ఆకాశమే హద్దుగా చెలరేగారు. వరుస సిక్సర్లతో దిల్లీని బెంబేలెత్తించారు. దీంతో కోల్‌కతా విజయం ఖాయమనుకున్న సమయంలో దిల్లీ బౌలర్లు మళ్లీ మెరిశారు. కీలక సమయంలో మోర్గాన్‌, రాహుల్​ను పెవిలియన్​కు చేర్చారు. దీంతో శ్రేయస్‌ జట్టు గెలుపొందింది.

అంతకముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (88 నాటౌట్‌; 38 బంతుల్లో 7x4, 6x6) మెరుపు బ్యాటింగ్, ఓపెనర్‌ పృథ్వీషా (66; 41 బంతుల్లో 4x4, 4x6), రిషభ్‌ పంత్‌ (38; 17 బంతుల్లో 5x4, 1x6) అద్భుతంగా రాణించడం వల్ల కోల్‌కతా ముందు దిల్లీ భారీ లక్ష్యాన్ని ఉంచింది. రసెల్‌ 2 వికెట్లు తీయగా వరుణ్‌‌, నాగర్‌కోటి చెరో వికెట్‌ పడగొట్టారు.

Last Updated : Oct 4, 2020, 12:13 AM IST

ABOUT THE AUTHOR

...view details