చివరివరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై కోల్‌కతా నైట్‌రైడర్స్ 2 పరుగుల తేడాతో గెలిచింది. పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్(74), మయాంక్ అగర్వాల్(56) శ్రమ వృథా అయింది.
ఉత్కంఠకర పోరు.. పంజాబ్‌పై కోల్‌కతా గెలుపు - పంజాబ్‌పై కోల్‌కతా గెలుపు
ఐపీఎల్లో పంజాబ్ జట్టు మరోసారి ఓడిపోయింది. కోల్‌కతాపై 2 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కేఎల్ రాహుల్, మయాంక్ శ్రమ వృథా అయిపోయింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తిక్(58) ధనాధన్ ఇన్నింగ్స్‌తో పాటు శుభ్‌మన్(57) బ్యాట్‌తో రాణించారు. పంజాబ్ బౌలర్లలో షమి, అర్షదీప్ సింగ్, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో పంజాబ్ ఓపెనర్లు మయాంక్-కేఎల్ రాహుల్.. తొలి వికెట్‌కు 115 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 56 పరుగులు చేసి మయాంక్ ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లో పూరన్ 16, సిమ్రన్ సింగ్ 4, మ్యాక్స్‌వెల్ 10, మన్దీప్ సింగ్ 0 పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, నరైన్ 2 వికెట్లు తీశారు.