కోల్‌కతా నైట్‌రైడర్స్ ఊపిరి పీల్చుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌పై 59 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్ ఆశల్ని సజీవం చేసుకుంది. అబుదాబి వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో దిల్లీ విఫలమైంది. దీంతో ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేయగలిగింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. ప్రారంభంలో 42 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. శుభ్‌మన్ గిల్(9), రాహుల్ త్రిపాఠి(13), దినేశ్ కార్తిక్(3) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అనంతరం వచ్చిన నరైన్.. ఓపెనర్ నితీశ్ రానాతో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.
క్రీజులో కుదురుకున్న తర్వాత వీరిద్దరూ బౌండరీల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే నాలుగో వికెట్‌కు 115 పరుగులు జోడించి, నరైన్(32 బంతుల్లో 64) ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ మోర్గాన్(17)తో కలిసిన నితీశ్ రానా.. కాసేపు ధనాధన్ బ్యాటింగ్ చేసి 81 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో నిర్ణీతో ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది కోల్‌కతా. దిల్లీ బౌలర్లలో అన్రిచ్, స్టోయినిస్, రబాడ తలో రెండు వికెట్లు పడగొట్టారు.