తెలంగాణ

telangana

ETV Bharat / sports

అందుకే సూపర్​ ఓవర్లో నేను బరిలో దిగా: కోహ్లీ - బెంగళూరు వర్సెస్ ముంబయి ఐపీఎల్

సోమవారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో కొన్ని ఫీల్డింగ్​ తప్పిదాలు సూపర్​ఓవర్​కు దారితీశాయని.. అలాంటి చిన్న విషయాలపై దృష్టి సారిస్తామని ఆర్సీబీ కెప్టెన్ కోహ్లీ తెలిపాడు.

Kohli reveals why he came with de Villers to bat in 'Super Over'
అందుకే సూపర్​ఓవర్లో నేను బరిలో దిగా: కోహ్లీ

By

Published : Sep 29, 2020, 12:21 PM IST

Updated : Sep 29, 2020, 5:36 PM IST

దుబాయ్​ అంతర్జాతీయ స్టేడియంలో సోమవారం జరిగిన ఉత్కంఠపోరులో ముంబయి ఇండియన్స్​పై రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు విజయం సాధించింది. సూపర్​ఓవర్​లో ఏబీ డివిలియర్స్​తో కలిసి బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే కొన్ని చిన్న తప్పిదాల వల్లే మ్యాచ్ సూపర్​ఓవర్​ వరకూ వచ్చిందని ఇంటర్వ్యూలో వెల్లడించాడు కోహ్లీ.

"ప్రస్తుతానికి నాకు మాటలు రావడం లేదు. ఈ రోజు మ్యాచ్​ రోలర్​-కోస్టర్​ను తలపించింది. మిడిల్​ ఆర్డర్​ ఆటగాళ్లు చాలా ఓపికగా ఆడారు. మా ప్రణాళికలు అమలు చేయడానికి ప్రయత్నించాం. చివరికి మాకే విజయం లభించింది. మ్యాచ్​లో చేసిన కొన్ని చిన్న తప్పిదాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. సూపర్​ఓవర్​లో ఆడేందుకు ఉత్తమమైన వ్యక్తులు ఎవరని ఆలోచించగా.. చివరికి నేను, ఏబీ డివిలియర్స్​ కలిసి ఆ బాధ్యతల్ని తీసుకున్నాం. ఫీల్డింగ్​లో తప్పిదాలు చేయకుండా ఉండి ఉంటే సూపర్​ఓవర్​కు దారి తీసేదే కాదు."

- విరాట్​ కోహ్లీ, రాయల్ ఛాలెంజర్స్​ బెంగళూరు కెప్టెన్​

తొలుత బ్యాటింగ్​ చేసిన ఆర్సీబీ.. మూడు వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఛేదనలో దిగిన రోహిత్​ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 రన్స్​ మాత్రమే చేయడం వల్ల మ్యాచ్​ టైగా నిలిచి సూపర్​ఓవర్​కు దారితీసింది. అందులో ముంబయి తొలుత బ్యాటింగ్ చేసి 7 పరుగులే చేయగా తర్వాత బెంగళూరు ఆ లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించడం వల్ల టోర్నీలో రెండో గెలుపును నమోదు చేసుకుంది కోహ్లీసేన.

Last Updated : Sep 29, 2020, 5:36 PM IST

ABOUT THE AUTHOR

...view details