దిల్లీతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ ఓడిపోవడానికి అంపైర్ నితిన్ మేనన్ అనవసర తప్పిదమే కారణమని అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ విషయాన్నే పంజాబ్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ మ్యాచ్ రిఫరీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం. తద్వారా ఐపీఎల్ పాలకమండలి దీనిపై చర్చించే అవకాశముంది. దీంట్లో పంజాబ్ ఫ్రాంచైజీకి రిపోర్ట్ చేసే హక్కు ఉందని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అధికారి పేర్కొన్నారు. ఆ తర్వాతే పరిస్థితిని అంచనా వేసేందుకు వీలుంటుందని తెలిపారు. ఇలాంటి తప్పిదాలు ఆటకు మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
"అంపైర్లంతా క్రికెట్లో కీలకపాత్ర పోషిస్తారు. ఇలాంటి లోపాలు.. అంపైరింగ్ ప్రమాణాలకు మంచిది కాదు. వారికి సాయంగా ఉండేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది"