'ఈటీవీ భారత్'కు ఇచ్చిన ఇంటర్వూలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. దిగ్గజ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటంపై తన అనుభవాలను వెల్లడించాడు.
అండర్-19 జట్టులో అద్భుత ప్రదర్శన చేశారు. ఇప్పుడు పంజాబ్ జట్టులోని దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం ఎలా ఉంది?
బిష్ణోయ్ : నా వయస్సు వారితో గడపటం చాలా సులువు. కానీ పంజాబ్ జట్టులోని క్రిస్ గేల్, కేఎల్ రాహుల్ లాంటి దిగ్గజాలతో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవటం గొప్ప అనుభూతి. నాకు ఇలాంటి వారితోనే ఐపీఎల్ ఆడాలనే కల ఉండేది.
అండర్-19జట్టుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? కుంబ్లే దగ్గర బౌలింగ్ ప్రాక్టీస్ చేయటం , కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోఆడటం, గేల్ ఇప్పుడు మీ సహచరులు, కోహ్లీ, ధోనీలకు బౌలింగ్ చేయటం ఎలా అనిపిస్తుంది ?
అనిల్ సర్ ఎప్పటికీ నాకు ఆదర్శం. ఆయన్ను టీవీలో చూస్తూ పెరిగా, ఇప్పుడు ఆయనతోనే డ్రెస్సింగ్ రూమ్ పంచుకున్నాను. ఇది అందరిలాగే నాకూ ఓ కల. నేను ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాను. ఇక మా బాస్( క్రిస్ గేల్ ) టీ20లీగ్కే కింగ్ లాంటివారు. ఆయనతో ఉండటం గొప్ప అనుభూతి. కెప్టెన్ రాహుల్ చాలా కూల్.