తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోల్​కతాపై దిల్లీ విజయం - Delhi team

Both teams have four points each from three matches and they will look to consolidate their positions on the points table when the second match of Saturday begins.

Delhi IPL
దిల్లీ-కోల్​కతా

By

Published : Oct 3, 2020, 7:04 PM IST

Updated : Oct 3, 2020, 11:41 PM IST

23:40 October 03

కోల్​కతా నైట్​ రైడర్స్​పై దిల్లీ క్యాపిటల్స్​ 18 పరుగులు తేడాతో గెలిచింది. 229 పరుగల లక్ష్యంతో బరిలో దిగిన కోల్​కతా 8 వికెట్లు కోల్పోయి 210కే పరిమితమైంది. దిల్లీ బౌలర్లలో అన్రిచ్‌ నోర్జే(3), హర్ష పటేల్​(2), కగిసొ రబడా, అమిత్​ మిశ్రా, స్టొయినిస్​ తలో వికెట్​ తీశారు. దిల్లీ విజయంలో సారథిశ్రేయస్‌ అయ్యర్‌ (88), పృథ్వీ షా(66), పంత్​(38) కీలక పాత్ర పోషించారు.  

23:30 October 03

కోల్​కతా ఏడో వికెట్​ కోల్పోయింది. మోర్గన్​(44) ఔట్ అయ్యాడు. 18.3 ఓవర్లకు స్కోరు 201/7గా ఉంది.  ఎనిమిది బంతుల్లో 28 పరుగులు చేయాలి. 

23:27 October 03

పద్దెనిమిది ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్​కతా ఆరు వికెట్లు కోల్పోయి 198పరుగులు చేసింది. క్రీజులో రాహుల్​ త్రిపాఠి(30), మోర్గన్(44)​ ఉన్నారు. 

23:22 October 03

స్టోయినిస్‌ వేసిన 17వ ఓవర్‌లో రాహుల్‌ త్రిపాఠి(26) చెలరేగాడు. మూడు సిక్సులు, ఒక బౌండరీ కొట్టాడు. దీంతో ఈ ఓవర్‌లో 24 పరుగులు వచ్చాయి. మోర్గాన్‌(24) పరుగులతో ఆడుతున్నాడు. 17 ఓవర్లకు ఆ జట్టు స్కోర్‌ 175/6గా నమోదైంది. 
 

23:18 October 03

రబాడ వేసిన 16వ ఓవర్‌లో మోర్గాన్‌(23) ఒక ఫోర్‌, ఒక సిక్స్‌ కొట్టాడు. అలాగే మరో నాలుగు పరుగులు వచ్చాయి. దీంతో ఈ ఓవర్‌ పూర్తయ్యేసరికి కోల్‌కతా స్కోర్‌ 151/6గా నమోదైంది. మరోవైపు రాహుల్‌ త్రిపాఠి(4) పరుగులతో కొనసాగుతున్నాడు. 

23:00 October 03

కమిన్స్

ఆరో వికెట్ కోల్పోయింది కోల్​కతా. కమిన్స్ 5 పరుగులు చేసి ఔటయ్యాడు.

22:53 October 03

కార్తీక్ ఔట్

ఐదో వికెట్ కోల్పోయిన కోల్​కతా. 6 పరుగులు చేసి క్యాచ్ ఔట్​గా వెనుదిరిగిన సారథి కార్తీక్.

22:50 October 03

రానా ఔట్

నాలుగో వికెట్ కోల్పోయిన కోల్​కతా. 58 పరుగులు చేసి వెనుదిరిగిన నితీశ్ రానా.

22:44 October 03

నితీశ్ రానా అర్ధశతకం 

కోల్​కతా యువ ఓపెనర్ నితీశ్ రానా అర్ధశతకం సాధించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం కోలకతా 12 ఓవర్లకు 108 పరుగులు చేసింది.

22:32 October 03

రసెల్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది కోల్​కతా. విధ్వంసకర ఓపెనర్ రసెల్ 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం కోల్​కతా 9.5 ఓవర్లకు 94 పరుగులు చేసింది.

22:18 October 03

శుభ్​మన్ గిల్ ఔట్

రెండో వికెట్ కోల్పోయింది కోల్​కతా నైట్​రైడర్స్. 28 పరుగులు చేసిన శుభ్​మన్ గిల్​ క్యాచ్​ ఔట్​గా వెనుదిరిగాడు. ప్రస్తుతం కోల్​కతా 8.1 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 72 పరుగులు చేసింది. నితీశ్ రానా 34 పరుగులతో నాటౌట్​గా ఉన్నాడు.

22:13 October 03

నితీశ్​(28), గిల్​(24) జోరుగా ఆడుతున్నారు. ఆరు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్​ నష్టానికి 61 పరుగులు చేశారు. 

22:01 October 03

కోల్​కతా దూకుడుగా ఆడుతోంది. స్టాయినిస్‌ బౌలింగ్‌లో గిల్‌ (21) బ్యాక్‌వర్డ్‌ స్వ్కేర్ లెగ్‌ మీదగా బౌండరీ సాధించాడు. అతడికి రాణా (19) చక్కని సహకారం అందిస్తున్నాడు. ఈ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు కోల్‌కతా 48/1


 

21:56 October 03

గిల్ (15)దూకుడు పెంచాడు. నోర్జె బౌలింగ్‌లో ఫోర్‌, సిక్సర్‌ సాధించాడు. దీంతో ఈ ఓవర్‌లో 12 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు కోల్‌కతా 39/1

21:50 October 03

మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి కోల్​కతా  వికెట్​ నష్టానికి 27 పరుగులు చేసింది. క్రీజులో శుభమన్​ గిల్​, నితీశ్​ రానా ఉన్నారు

21:45 October 03

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకు ఆదిలోనే షాక్‌. నోర్జె బౌలింగ్‌లో నరైన్‌ (3) క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. 1.2 ఓవర్లకు కోల్‌కతా 8/1

21:43 October 03

రబాడ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. తొలి ఓవర్‌లో 4 పరుగులే ఇచ్చాడు. గిల్ (1), నరైన్‌ (3) ఆచితూచి ఆడుతున్నారు. ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా 4/0

21:39 October 03

కోల్‌కతా తరఫున ఛేదనకు శుభ్‌మన్‌ గిల్‌, నరైన్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. శ్రేయస్‌ అయ్యర్‌ బంతిని రబాడకు ఇచ్చాడు.

21:17 October 03

కేకేఆర్ లక్ష్యం 229

కోల్​కతా నైట్​రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో దిల్లీ క్యాపిటల్స్ వీరవిహారం చేసింది. కేకేఆర్ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు దిల్లీ బ్యాట్స్ మెన్. మొదట ఓపెనర్ పృథ్వీ షా 66 పరుగులతో చెలరేగగా.. తర్వాత సారథి శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 88 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో దిల్లీ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 228 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 

21:16 October 03

స్టోయినిస్ ఔట్

నాలుగో వికెట్ కోల్పోయింది దిల్లీ. స్టోయినిస్ 1 పరుగు చేసి ఔటయ్యాడు.

21:14 October 03

19 ఓవర్లకు దిల్లీ 221/3

దిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 88 పరుగులతో సెంచరీకి చేరువయ్యాడు.

21:08 October 03

పంత్ ఔట్

మూడో వికెట్ కోల్పోయింది దిల్లీ క్యాపిటల్స్. భారీ షాట్ ఆడబోయి రిషబ్ పంత్ (38) క్యాచ్ ఔటయ్యాడు. ప్రస్తుతం దిల్లీ 17.5 ఓవర్లకు 201 పరుగుల భారీ స్కోర్ చేసింది.

20:56 October 03

శ్రేయస్ అర్ధశతకం

దిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 26 బంతుల్లో అర్ధ శతకం బాదాడు. ప్రస్తుతం దిల్లీ 16 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. 

20:40 October 03

13 ఓవర్లకు దిల్లీ 131/2

13 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ క్యాపిటల్స్ రెండు వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. పంత్ (1), శ్రేయస్ అయ్యర్ (31) క్రీజులో ఉన్నారు.

20:34 October 03

పృథ్వీ షా ఔట్

రెండో వికెట్ కోల్పోయింది దిల్లీ. భారీ షాట్ ఆడబోయి క్యాచ్ ఔట్ అయ్యాడు పృథ్వీ షా. దీంతో ఇతడి 66 పరుగుల ఇన్నింగ్స్ కు తెరపడింది.

20:24 October 03

పృథ్వీ షా హాఫ్ సెంచరీ

దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా హాఫ్ సెంచరీ చేశాడు. 35 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం దిల్లీ 11 ఓవర్లలో వికెట్ నష్టానికి 105 పరుగులు చేసింది.  

20:22 October 03

10 ఓవర్లకు దిల్లీ 61/1

10 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. పృథ్వీ షా (46), శ్రేయస్ అయ్యర్ (17) క్రీజులో ఉన్నారు.

20:05 October 03

7 ఓవర్లకు దిల్లీ 61/1

7 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. పృథ్వీ షా (36), శ్రేయస్ అయ్యర్ (2) క్రీజులో ఉన్నారు.

19:58 October 03

ధావన్ ఔట్

తొలి వికెట్ కోల్పోయింది దిల్లీ క్యాపిటల్స్. భారీ షాట్ ఆడబోయి శిఖర్ ధావన్ (26) క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు.

19:53 October 03

5 ఓవర్లకు దిల్లీ 51/0

5 ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ క్యాపిటల్స్ 51 పరుగులు చేసింది. పృథ్వీ షా (25), శిఖర్ ధావన్ (26) క్రీజులో ఉన్నారు.

19:43 October 03

మూడు ఓవర్లకు దిల్లీ 29/0

మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి దిల్లీ క్యాపిటల్స్ 29 పరుగులు చేసింది. పృథ్వీ షా (21), శిఖర్ ధావన్ (8) క్రీజులో ఉన్నారు.

19:34 October 03

మొదటి ఓవర్లో దిల్లీ 8 పరుగులు 

తొలి ఓవర్లో 8 పరుగులు చేసింది దిల్లీ క్యాపిటల్స్. పృథ్వీ షా (6), శిఖర్ ధావన్ (2) ఓపెనర్లుగా బరిలో దిగారు.

19:04 October 03

జట్లు

దిల్లీ క్యాపిటల్స్

పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రిషభ్ పంత్, హెట్​మెయర్, స్టోయినిస్, అశ్విన్, కగిసో రబాడ, ఎన్రిచ్ నోర్ట్జే, అమిత్ మిశ్రా, హర్షల్ పటేల్

కోల్​కత్ నైట్​రైడర్స్

శుభ్​మన్ గిల్, సునీల్ నరైన్, నితీశ్ రానా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్), ఇయాన్ మోర్గాన్, ఆండ్రూ రసెల్, ప్యాట్ కమిన్స్, కమలేష్ నాగర్​కోటి, శివం మావి, రాహుల్ త్రిపాఠి, వరుణ్ చక్రవర్తి

18:38 October 03

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్

డీసీ-కేకేఆర్

ఐపీఎల్​లో భాగంగా లీగ్​లో 16వ మ్యాచ్​ దిల్లీ క్యాపిటల్స్-కోల్​కతా నైట్​రైడర్స్ మధ్య జరగనుంది. ఇరుజట్లు రెండు మ్యాచ్​ల్లో గెలిచి 4 పాయింట్లతో ఉన్నాయి. లీగ్​లో మూడో విజయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాయి. తాజాగా ఈ రెండింటి మధ్య జరిగే మ్యాచ్​లో మొదట టాస్ గెలిచిన కోల్​కతా బౌలింగ్ ఎంచుకుంది.

Last Updated : Oct 3, 2020, 11:41 PM IST

ABOUT THE AUTHOR

...view details