కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఈ గెలుపులో ముంబయి సారథి రోహిత్ శర్మ కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబయి ఇండియన్స్ ప్రారంభంలోనే ఓపెనర్ డికాక్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి రోహిత్ శర్మ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఈ క్రమంలో సరికొత్త ఘనతల్ని సాధించాడు హిట్‌మ్యాన్.
200వ సిక్సర్ల మైలురాయి
ఈ మ్యాచ్‌లో ఆరు సిక్సర్లు బాదిన రోహిత్ లీగ్‌లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. లీగ్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన నాలుగో బ్యాట్స్‌మన్‌గా ఘనత సాధించాడు. తొలి మూడు స్థానాల్లో గేల్ (316), ఏబీ డివిలియర్స్ (214), ధోనీ (212) ఉన్నారు.
రోహిత్ నయా రికార్డు
లీగ్‌లో ఒక జట్టుపై అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. కోల్‌కతాపై అతడు 875 పరుగులు సాధించాడు. అతడి తర్వాత స్థానంలో డేవిడ్ వార్నర్ (829) ఉన్నాడు. వార్నర్ కూడా ఇదే జట్టుపై సాధించడం విశేషం.