ఐపీఎల్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన ఈ రెండు టీమ్‌లు నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఐదో విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నాయి.
కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టులో ఆండ్రూ రస్సెల్ సరైన ఫామ్‌లో లేడు. సునీల్ నరైన్ బౌలింగ్‌పై బీసీసీఐకి ఫిర్యాదు అందడం వల్ల ఆ జట్టు మరింత చిక్కుల్లో పడినట్లైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై జరిగిన మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్, కెప్టెన్ దినేశ్ కార్తిక్ మంచి ప్రదర్శన చేశారు. బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, సునీల్ నరైన్ గత మ్యాచ్‌లో బాగా రాణించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్లు దేవ్‌దత్ పడిక్కల్, ఆరోన్ ఫించ్ మంచి ప్రదర్శన చేస్తున్నారు. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. మిడిల్ ఆర్డర్లో ఏబీ డివిలియర్స్, ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరితో పాటు సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ మోరిస్ అడుగుపెట్టి అద్భుత ప్రదర్శన చేశాడు. ఇతడి రాకతో బౌలింగ్ లైనప్ మరింత శక్తిమంతంగా మారింది. గత మ్యాచ్‌ల్లోని తుది జట్లు అద్భుతంగా రాణించడం వల్ల ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లను దాదాపుగా మార్చే అవకాశం లేదు.