ముంబయి ఇండియన్స్‌కు తాత్కాలిక కెప్టెన్సీ వహించే కీరన్ పొలార్డ్.. ఆల్‌రౌండర్లు పాండ్యా బ్రదర్స్‌తో తనకున్న బంధాన్ని ఓ వీడియో ద్వారా పంచుకున్నాడు. ఈ వీడియో ముంబయి ఇండియన్స్ జట్టు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.
'ఒకరు 'హార్డిక్' పాండ్యా, మరొకరు 'స్మార్టర్' పాండ్యా' - వీడియో షేర్ చేసిన పొలార్డ్
ముంబయి ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్.. పాండ్యా బ్రదర్స్ ఇద్దరూ తనకు ఆప్తమిత్రులేనని తెలుపుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది ముంబయి ఫ్రాంచైజీ.
"ఒకరు 'హార్ఢిక్' పాండ్యా అయితే ఇంకొకరు 'స్మార్టర్' పాండ్యా" అని కీరన్ పొలార్డ్ వీడియోలో చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేసింది ముంబయి జట్టు. ఈ వీడియోలో.. పాండ్యా బ్రదర్స్, పొలార్డ్ సన్నిహతంగా మెదిలే సన్నివేశాలను కూడా జత చేసింది. అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో, ఇతరులకు సాయం చేయడంలో మేం దాదాపు ఒకే విధంగా ఆలోచిస్తాం. ఆఫ్ ఫీల్డ్‌లో మాకున్న సాన్నిహత్యం ఆన్‌ఫీల్డ్‌కు వచ్చే సరికి మరింత ధృడంగా మారుతుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
ఇదీ చదవండి:అంపైర్లపై సర్ఫరాజ్ అసభ్యకర వ్యాఖ్యలు