కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేయాలని టీమ్ఇండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. మోర్గాన్, రస్సెల్ తర్వాతే కెప్టెన్ దినేశ్ కార్తీక్ బ్యాటింగ్ చేయాలని సూచించాడు. సునీల్ నరైన్‌ను టాప్ ఆర్డర్ నుంచి తప్పించాలని పేర్కొన్నాడు. ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా ఓటమి చవిచూసింది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లో మోర్గాన్ కంటే ముందు కార్తీక్ బరిలోకి దిగాడు. అయినప్పటికీ అతనికంటే ఎక్కువ స్కోరు సాధించలేకపోయాడు. ఈ క్రమంలోనే అభిమానుల నుంచి అనేక విమర్శలు ఎదుర్కొంటున్నాడు కార్తీక్.
"రాహుల్ త్రిపాఠి టాప్ ఆర్డర్లో దిగాలి. దినేశ్ కార్తీక్.. మోర్గాన్, రస్సెల్ తర్వాత ఆరో స్థానంలో మైదానంలో అడుగుపెట్టాలి. సునీల్ నరైన్‌ను ఎనిమిది లేదా తొమ్మిదో స్థానానికి పరిమితం చేస్తే మంచిది. జట్టులో అత్యుత్తమ బౌలర్ల చేత డెత్ ఓవర్లు వేయించాలి. కానీ అది చేయలేదు."