ఐపీఎల్లో స్టార్ బౌలర్ రబాడ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. దిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఇతడు.. హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. తద్వారా వరుసగా 10 మ్యాచ్‌ల్లో రెండేసి వికెట్లు తీసిన ఆటగాడి నిలిచాడు. అంతకుముందే మలింగ(8 మ్యాచుల్లో) పేరిట ఈ రికార్డు ఉంది.
మలింగను వెనక్కు నెట్టి రబాడ రికార్డు - IPL 2020 RECORD
వరుసగా 10 మ్యాచుల్లో రెండు వికెట్ల కంటే ఎక్కువ తీసి, మలింగను అధిగమించాడు పేసర్ రబాడ.
బౌలర్ కగిసో రబాడ
ఈ సీజన్లో మూడు మ్యాచ్‌లాడిన రబాడ.. ఏడు వికెట్లు తీశాడు. పర్పుల్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. తర్వాతి మ్యాచ్‌లో దిల్లీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అక్టోబరు 3న ఆడనుంది. దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది.