మహేంద్రసింగ్ ధోనీ జెర్సీని సొంతం చేసుకోవాలని ఎవరు కోరుకోరు చెప్పండి. అందుకు ప్రత్యర్థి క్రికెటర్లు కూడా మినహాయింపు కాదు. అబుదాబి వేదికగా సోమవారం రాత్రి రాజస్థాన్, చెన్నై మధ్య మ్యాచ్ జరిగింది. ధోనీ టీ20 లీగ్ కెరీర్‌లో ఇది 200వ మ్యాచ్. మరే ఆటగాడు ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఆటగాడు బట్లర్ దూకుడైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును గెలిపించాడు.
బట్లర్‌కు ధోనీ కానుక.. ఏంటంటే! - బట్లర్ తాజా వార్తలుట
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. బట్లర్ 70 పరుగులతో జట్టును గెలిపించాడు. ఆ విజయం కంటే బట్లర్‌కు ఓ బహుమతి మరింత కిక్ ఇచ్చింది. అదే ధోనీ జెర్సీ. మహీ అంటే తనకెంతో అభిమానమని బట్లర్ పలుమార్లు చెప్పాడు.
అయితే.. బట్లర్‌కు ఈ మ్యాచ్ తన ఇన్నింగ్స్ కంటే మరో మధుర అనుభూతినిచ్చింది. అదే ధోనీ జెర్సీ. ఈ మ్యాచ్‌లో మహీ ధరించిన జెర్సీని మ్యాచ్ ముగియగానే బట్లర్‌కు బహుమతిగా ఇచ్చాడు. ఆ జెర్సీతో మురిసిపోతున్న బట్లర్ ఫొటోను రాజస్థాన్ యాజమాన్యం ట్విట్టర్లో పోస్టు చేసింది. ధోనీ అంటే తనకెంతో అభిమానం అని ఈ ఇంగ్లీష్ హిట్టర్ పలుమార్లు వెల్లడించాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ బ్యాట్స్‌మన్ బట్లర్ (70; 40బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. దీంతో చెన్నై 7 వికెట్ల తేడాతో ఓడింది.