తెలంగాణ

telangana

ETV Bharat / sports

బుమ్రా తొలి, వందో వికెట్​ కోహ్లీనే - కోహ్లీ 100వ వికెట్​

ముంబయి ఇండియన్స్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఐపీఎల్లో 100 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. అయితే ఈ టోర్నీలో అతడి తొలి, వందో వికెట్ కోహ్లీనే కావడం విశేషం.

Jasprit Bumrah's
బుమ్రా

By

Published : Oct 28, 2020, 10:44 PM IST

Updated : Oct 28, 2020, 11:05 PM IST

ముంబయి ఇండియన్స్‌ పేసర్‌ జస్ప్రిత్‌ బూమ్రా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో 100 వికెట్లు తీసిన ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. బుధవారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అతడు కేవలం 14 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అందులో ఆర్సీబీ సారథి విరాట్‌ కోహ్లీ వికెట్‌ తీయడం వల్ల 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అయితే ఈ లీగ్​లో బుమ్రా తీసిన తొలి వికెట్​ కూడా కోహ్లీదే అవ్వడం మరో విశేషం. మొత్తంగా టీ20ల్లో 200 వికెట్లు తీశాడు బుమ్రా.

కాగా లీగ్​ చరిత్రలో 122 మ్యాచ్‌లు ఆడిన లసిత్‌ మలింగ 170 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉండగా.. 150 మ్యాచ్‌లు ఆడి 160 వికెట్లు తీసిన అమిత్‌ మిశ్రా(2), 164 మ్యాచ్‌లు ఆడి 156 వికెట్లతో పీయూష్‌ చావ్లా(3)వ స్థానంలో కొనసాగుతున్నారు. డ్వేన్‌ బ్రావో (153), హర్భజన్‌ సింగ్‌ (150), భువనేశ్వర్‌ కుమార్‌ (136), రవిచంద్రన్‌ అశ్విన్‌ (134), సునీల్‌ నరైన్‌ (127), ఉమేష్‌ యాదవ్‌ (119), యుజ్వేంద్ర చాహల్‌ (116), రవీంద్ర జడేజా (112), ఆశిష్‌ నెహ్రా (106), వినయ్ కుమార్‌ (105), సందీప్‌ శర్మ (103), జహీర్‌ ఖాన్‌ (102)తో సమానంగా జస్ప్రీత్‌ బూమ్రా (102) కొనసాగుతున్నాడు.

Last Updated : Oct 28, 2020, 11:05 PM IST

ABOUT THE AUTHOR

...view details