కోల్‌కతాతో మ్యాచ్‌లో చెన్నై జట్టు ఓటమికి కారణం కేదార్ జాదవ్ పేలవమైన ప్రదర్శనే కారణమని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. అతడిని రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో కన్నా ముందే ఎందుకు పంపారని ఫ్రాంచైజీని ప్రశ్నిస్తున్నారు. అతడికి స్పిన్ బౌలింగ్ వేసే సామర్థ్యం ఉన్నందునే, దానిని అంచనా వేయగలడని భావించి ముందుగా పంపించినట్లు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వివరణ ఇచ్చాడు. అయితే తమ ప్రణాళిక తారుమారైందని అన్నాడు.
"కేదార్ స్పిన్ బాగా వేయగలడు. ప్రత్యర్థి ఆటగాళ్లపై ఆధిపత్యం చెలాయించగలడు. జడేజా మంచి ఫినిషర్. అందుకే అలా పంపించాల్సి వచ్చింది. కానీ చివర్లో కోల్‌కతా ఆటగాళ్ల ఒత్తిడి తీసుకురావడం వల్ల మా ప్రణాళిక తారుమారైంది. అయినా రోజులన్నీ ఒకేలా ఉండదు. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం నేర్పింది. ఇలాంటి ప్రదర్శన మళ్లీ చేయాలని అనుకోవడం లేదు. మా జట్టులో బౌలర్లు, బ్యాట్స్‌మెన్ సమతుల్యత ఉంది. అందుకే మరో అదనపు బ్యాట్స్‌మన్‌ను తీసుకోవాలన్న ఆలోచన చేయలేదు. మాలోని లోపాలను సరిచేసుకుని తర్వాతి మ్యాచ్‌కు సంసిద్ధంగా ఉంటాం"