తెలంగాణ

telangana

ETV Bharat / sports

'యూఏఈలో సుదీర్ఘ ఇన్నింగ్​ ఆడాలంటే కష్టమే' - ఐపీఎల్ 2020 వార్తలు

కోల్​కతా నైట్​రైడర్స్​పై అద్భుత ఇన్నింగ్స్​తో ముంబయి ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు సారథి రోహిత్ శర్మ. సుదీర్ఘ ఇన్నింగ్స్​తో ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ యూఏఈ వాతావరణంలో ఎక్కువ సమయం ఆడటం అంత సులభమేమీ కాదని తెలిపాడు.

It is not easy to play long innings in UAE: Rohit Sharma
'యూఏఈలో సుదీర్ఘ ఇన్నింగ్​ ఆడాలంటే కష్టమే'

By

Published : Sep 24, 2020, 12:58 PM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్ ఘనవిజయం సాధించింది. ముంబయి సారథి రోహిత్ శర్మ 80 పరుగులు చేశాడు. ఓపెనర్​గా వచ్చిన హిట్​మ్యాన్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాడు. అందువల్ల చివర్లో అలసిపోయినట్లుగా కనిపించాడు. దీనిపై మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్.. యూఏఈ వాతావరణంలో ఎక్కువ సమయం ఆడటం అనుకున్నంత సులభంగా ఏమీ లేదని అన్నాడు.

"సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడటం ఇక్కడ సులభమేమీ కాదు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువసేపు ఆడాలంటే శక్తినంతా ఖర్చుచేయాల్సిందే. చివర్లో అలసిపోయినట్టు అనిపించింది. నిలదొక్కుకున్న బ్యాట్స్‌మన్‌ సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడే క్రమంలో మా అందరికీ ఇదో పాఠం. గతంలోనూ ఇలాంటి పరిస్థితి అనుభవించాం. అందుకే ఎక్కువ సేపు ఆడేందుకు ప్రయత్నించా."

-రోహిత్ శర్మ, ముంబయి ఇండియన్స్ సారథి

"పుల్‌ షాట్లు ఆడేందుకు ప్రయత్నించా. వాటినే సాధన చేశా. మా జట్టు ప్రదర్శన సంతోషం కలిగించింది. నా షాట్లన్నీ బాగున్నాయి. ఏదో ఒకటి బాగుందని చెప్పలేను. పిచ్‌ కొద్దిగా పేసర్లకు అనుకూలించడం వల్ల వాంఖడే మనస్తత్వంతో బౌలింగ్‌ చేశాం. బౌల్ట్‌, ప్యాటిన్సన్‌తో కలిసి ఎక్కువగా ఆడనప్పటికీ వారెంతో అద్భుతంగా బంతులు విసిరారు. మా జట్టులో 2014లో ఇద్దరు మాత్రమే యూఏఈలో ఆడారు. ప్రణాళికలు అమలు చేసి విజయం అందుకున్నాం" అని హిట్‌మ్యాన్‌ చెప్పాడు.

అబుదాబి వేదికగా జరిగిన మ్యాచ్​లో ముంబయి 49 పరుగుల తేడాతో కోల్‌కతాను ఓడించింది. రోహిత్‌ (80; 54 బంతుల్లో 3×4, 6×6), సూర్యకుమార్‌ యాదవ్‌(47; 28 బంతుల్లో 6×4, 1×6) ఆ జట్టు 195/5 పరుగులు చేసేందుకు పటిష్ఠ పునాది వేశారు. ఛేదనలో కార్తీక్‌ బృందం 146/9కే పరిమితమైంది. కార్తీక్‌ (30), నితీశ్‌ రాణా (24), కమిన్స్‌ (33) మినహా మరెవ్వరూ రాణించలేదు.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details