ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే. గురువారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగే ఈ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. మరి ఎవరు ముందడగు వేస్తారో చూడాలి?
బ్యాట్స్‌మెన్ వైఫల్యం
గత మ్యాచ్‌లో చెన్నైపై గెలిచి, నాకౌట్ ఆశల్ని సజీవం చేసుకుంది రాజస్థాన్. ఆ పోరులో 70 పరుగులు చేసిన బట్లర్‌కు సహకరమందించడంలో మిగిలిన ఆటగాళ్లు విఫలమయ్యారు. స్టోక్స్, ఉతప్ప అంతంత మాత్రంగానే రాణిస్తుండగా.. యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ బ్యాటింగ్‌లో విఫలమవుతున్నాడు. మిడిల్ ఆర్డర్ సమస్య కూడా రాజస్థాన్‌ను వెంటాడుతోంది.
బౌలింగ్‌లో ఆర్చర్, శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాతియా, కార్తిక్ త్యాగి మంచి ప్రదర్శన చేస్తున్నారు. బెన్‌స్టోక్స్‌కు గత మ్యాచ్‌లో గాయమైంది. సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం లేకపోవచ్చు.