ఆదివారం జరిగే మ్యాచ్‌తో ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం సాగే రసవత్తర పోరులో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలో దిగనున్నాడు. ఇతడి రాకతో జట్టు మరింత దృఢంగా మారుతుందని కెప్టెన్ స్మిత్ భావిస్తున్నాడు.
టోర్నీలో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో రెండింటిని గెలిచి, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది రాజస్థాన్. ఆరు మ్యాచ్‌ల్లో మూడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది హైదరాబాద్.
స్టోక్స్ రాకతో..
తన తండ్రికి అనారోగ్యం కారణంగా ఆగస్టులో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ నుంచి అర్థాంతరంగా తప్పుకున్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక సిరీస్‌కూ అందుబాటులో లేడు. తన తండ్రి కోరిక మేరకు ఐపీఎల్లో పాల్గొనడానికి ఇటీవలే యూఏఈకి వచ్చాడు. ఈ నేపథ్యంలో బెన్‌స్టోక్స్ క్వారంటైన్ శనివారంతో ముగుస్తుంది. దీంతో ఆదివారం జరిగే మ్యాచ్‌లో బరిలో దిగనున్నాడని ఆ జట్టు యాజమాన్యం తెలిపింది.
ఓపెనర్లు డీలా
శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో దిల్లీ జట్టుపై 46 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో రాయల్స్ ఓపెనర్లు విఫలమయ్యారు. బౌలింగ్ లైనప్‌లో పేసర్ జోఫ్రా ఆర్చర్, స్పిన్నర్లు తెవాతియా, శ్రేయస్ గోపాల్‌తో బలంగా ఉంది. ఆరంభంలో షార్జా వేదికగా జరిగిన రెండు మ్యాచ్‌లను గెలిచిన రాజస్థాన్ జట్టు ఆ తర్వాత జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా పరాజయం పాలైంది.
అద్భుతమైన ఫామ్‌లో
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు బెయిర్ స్టో, డేవిడ్ వార్నర్ చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో వీరిద్దరూ విజయవంతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే మ్యాచ్‌లో స్పిన్నర్ రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్తో పాటు యువ ఆటగాళ్లు ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మలతో మిడిల్ ఆర్డర్ మెరుగ్గా కనిపిస్తుంది. బౌలింగ్ లైనప్‌లో సీనియర్లు భువనేశ్వర్ కుమార్, మిచెల్ మార్ష్ గాయాలతో తప్పుకున్నప్పటికీ.. అగ్రశ్రేణి టీ20 బౌలర్లైన రషీద్ ఖాన్, యార్కర్ స్పెషలిస్టు టి నటరాజన్ అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నారు.
జట్లు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: డేవిడ్ వార్నర్ (కెప్టెన్), జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, శ్రీవాత్సవ గోస్వామి, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్, వృద్దిమాన్ సాహా, అబ్దుల్ సమద్, విజయ్ శంకర్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, జాసన్ హోల్డర్, సంజయ్ యాదవ్, ఫాబియన్ అలెన్, పృథ్వీ రాజ్ యర్రా, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, బిల్లీ స్టాన్లేక్, టి నటరాజన్, బాసిల్ తంపి.
రాజస్థాన్ రాయల్స్:జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, సంజూ శాంసన్, ఆండ్రూ టై, కార్తీక్ త్యాగి, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), అంకిత్ రాజ్‌పుత్, శ్రేయాస్ గోపాల్, రాహుల్ తెవాతియా, జయదేవ్ ఉనద్కత్, మయాంక్ మార్కండే, మహీపాల్ లోమ్రోర్, ఓషనే థామస్, రియాన్ పరాగ్, యశస్వి జైశ్వాల్, అనుజ్ రావత్, ఆకాశ్ సింగ్, డేవిడ్ మిల్లెర్, మనన్ వోహ్రా, శశాంక్ సింగ్, వరుణ్ ఆరోన్, టామ్ కరన్, రాబిన్ ఉత్తప్ప, అనిరుద్ధ జోషి, జోఫ్రా ఆర్చర్.