తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆర్ఆర్Xఆర్సీబీ: విజయమే లక్ష్యంగా బరిలోకి! - రాజస్థాన్ బెంగళూరు మ్యాచ్

నేడు (శనివారం) రాజస్థాన్ రాయల్స్​తో జరిగే మ్యాచ్​లో గెలిచి ప్లేఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలని రాయల్ ఛాలెంజర్ బెంగళూరు జట్టు భావిస్తోంది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

బెంగళూరు vs రాజస్థాన్: కోహ్లీ ఈసారి ఎలాంటి ప్లాన్ వేస్తాడో?
RCB look to get tactics right as they face Rajasthan Royals

By

Published : Oct 17, 2020, 5:23 AM IST

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో పోరుకు సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్​తో దుబాయ్ వేదికగా నేడు (శనివారం) తలపడనుంది. గత మ్యాచ్​ల్లో వేరువేరుగా ఓడిన ఇరుజట్లు.. ఈరోజు ఎలాగైనా సరే గెలవాలనే పట్టుదలగా ఉన్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

కోహ్లీ ప్లాన్ తప్పింది!

ఎనిమిదింటిలో ఐదు మ్యాచ్​లు గెలిచి ఫామ్​లో ఉన్న బెంగళూరు.. పంజాబ్​తో గత మ్యాచ్​లో ఓడింది. కోహ్లీ వేసిన ప్లాన్ విఫలమైంది. ప్రత్యర్థి జట్టులో లెగ్ స్పిన్నర్లు ఉన్నారనే కారణంతో విధ్వంసక డివిలియర్స్​ను ఆరో స్థానంలో బ్యాటింగ్​కు పంపాడు విరాట్. కానీ అతడు కేవలం రెండు పరుగులే చేసి ఔటయ్యాడు. కోహ్లీ(48) మినహా మిగతా బ్యాట్స్​మన్ తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. బౌలర్లలో మోరిస్, సైనీ, ఉదానా పరుగులు కట్టడి చేయగా, చాహల్, సుందర్, సిరాజ్ పరుగులు సమర్పించారు. రాజస్థాన్​తో మ్యాచ్​లో ఈ అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది.

కోహ్లీ-డివిలియర్స్

రాజస్థాన్​ ప్రతి మ్యాచ్ గెలవాలి!

ఈ సీజన్​ ప్రారంభంలో రెండు మ్యాచ్​లు గెలిచి ఊపు మీద కనిపించిన రాజస్థాన్.. ఆ తర్వాత ఐదు మ్యాచ్​ల్లో కేవలం ఒక్కదానిలోనే విజయం సాధించింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దిగువ నుంచి రెండో స్థానంలో ఉంది. ఫ్లే ఆఫ్స్​లో అడుగుపెట్టాలంటే ఇకపై ప్రతి మ్యాచ్​ను గెలవాల్సి ఉంటుంది. ఈ జట్టులో ఓపెనర్లు సరిగ్గా ఆడలేకపోతున్నారు. మిడిలార్డర్​ బ్యాట్స్​మన్ ఇబ్బంది పడుతున్నారు. బౌలర్లు రాణించినా సరే ఫలితం లేకుండా పోతోంది. ఇలాంటి సమయంలో రాయల్స్ ఏం చేస్తుందో చూడాలి.

రాజస్థాన్ రాయల్స్

జట్లు(అంచనా)

బెంగళూరు: దేవ్​దత్ పడిక్కల్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబె, క్రిస్ మోరిస్, ఉదానా, సైనీ, సిరాజ్, చాహల్

రాజస్థాన్: స్టోక్స్, బట్లర్, స్మిత్(కెప్టెన్), సంజూ శాంసన్, ఉతప్ప, రియాన్ పరాగ్, తెవాతియా, ఆర్చర్, శ్రేయస్ గోపాల్, ఉనద్కత్, కార్తిక్ త్యాగి

ABOUT THE AUTHOR

...view details