తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంజాబ్​​xహైదరాబాద్​: ఫ్లే ఆఫ్స్​కు చేరాలంటే గెలవాల్సిందే - ipl 2020 updates

శనివారం జరిగే మ్యాచ్​లో హైదరాబాద్​, పంజాబ్​ హోరాహోరీగా తలపడనున్నాయి. ఫ్లేఆఫ్ అవకాశాలు మెరుగుపరుచుకోవాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్​ ఎంతో కీలకం. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30గంటలకు ప్రారంభం కానుంది. మరి ఎవరు గెలుస్తారో చూడాలి?

KXIP VS SRH
పంజాబ్​​xహైదరాబాద్​

By

Published : Oct 24, 2020, 8:59 AM IST

దుబాయ్​ వేదికగా మరో రసవత్త పోరుకు రంగం సిద్ధమైంది. పది మ్యాచుల్లో ఆరింటిలో ఓడి పాయింట్ల పట్టికలో ఐదు, ఆరు స్థానాల్లో ఉన్న హైదరాబాద్​, పంజాబ్ జట్లు​ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ పోరులో గెలిచి తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. ఈ సందర్భంగా ఇరుజట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

జోరును కొనసాగిస్తుందా?

లీగ్​ను ఓటములతో ప్రారంభించినా.. ప్రస్తుతం హ్యాట్రిక్​ విజయాలతో దూసుకెళ్తోంది పంజాబ్​. బ్యాటింగ్ విభాగం కెప్టెన్ కేఎల్ రాహుల్​, మయాంక్​ అగర్వాల్, క్రిస్​ గేల్​, నికోలస్​ పూరన్​​తో బలంగా ఉంది. ఇటీవలే జట్టులోకి తిరిగొచ్చిన గేల్.. గత రెండు మ్యాచుల్లో అద్భుతంగా ఆడాడు. దీంతో ఓపెనర్లు రాహుల్​, మయాంక్​లపై కొంత భారం తగ్గింది. జిమ్మీ నీషమ్ జట్టులోకి చేరడం వల్ల బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లో సమతుల్యం ఏర్పడింది. బౌలర్లు బాగానే రాణిస్తున్నారు. అయితే పంజాబ్..​ ప్లేఆఫ్​ ఆశల్ని సజీవం చేసుకోవాలంటే ఇకపై ఆడే ప్రతి మ్యాచ్​లోనూ గెలవాల్సి ఉంటుంది. కాబట్టి సన్​రైజర్స్​తో మ్యాచును ఎలాగైనా గెలవాలనే కసితో బరితో దిగుతోంది. మరి ఏం చేస్తుందో చూడాలి.

ఎలా ఆడుతుందో?

వరుస పరాజయాలతో సతమవుతున్న హైదరాబాద్..​ ఎట్టకేలకు రాజస్థాన్​పై విజయం సాధించింది. సారథి వార్నర్​, బెయిర్​ స్టో, మనీశ్​ పాండే, విజయ్​ శంకర్​ మంచి ఫామ్​లో ఉన్నారు. ఆల్​రౌండర్ హోల్డర్ కూడా రాణిస్తున్నాడు. బౌలర్లలో అబ్దుల్​ సమాద్​, యార్కర్​ స్పెషలిస్ట్​ టి.నటరాజన్​ తమ ప్రదర్శనను కొంచెం మెరుగుపరుచుకుంటే జట్టుకు తిరుగుండదు. సన్​రైజర్స్​ కూడా ప్లేఆఫ్స్​కు అర్హత సాధించాలంటే ఆడే ప్రతి మ్యాచ్​లోనూ గెలవడం ఎంతో కీలకం.

జట్లు (అంచనా)

హైదరాబాద్​ :డేవిడ్​ వార్నర్​ (కెప్టెన్​), బెయిర్​స్టో, విలియమ్సన్​, మనీశ్​ పాండే, ప్రియమ్​ గార్గ్​, విజయ్ శంకర్, అబ్దుల్​ సమద్​, రషీద్ ఖాన్​, ఖలీల్​ అహ్మద్​, సందీప్​ శర్మ, నటరాజన్​

పంజాబ్​ : కేఎల్ రాహుల్(సారథి), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, గ్లెన్ మాక్స్​వెల్​ దీపక్ హోడా, జేమ్స్ నీషమ్, మురుగన్ అశ్విన్, మహ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్​దీప్​ సింగ్

ABOUT THE AUTHOR

...view details