తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐపీఎల్​ : కోహ్లీసేన జోరు కొనసాగిస్తుందా?

దుబాయ్​ వేదికగా రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు-కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​​ మధ్య నేడు(సెప్టెంబరు 24) మ్యాచ్​ జరగనుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు ఆట​ ప్రారంభం కానుంది. ఆడిన తొలి మ్యాచ్​లోనే ఓటమిపాలైనా పంజాబ్​ ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. అలాగే ఈ సీజన్​లో మొదటి మ్యాచ్​తో శుభారంభం చేసిన ఆర్సీబీ మరోసారి అదరగొట్టాలని భావిస్తోంది.

PREVIEW
కోహ్లీ సేన

By

Published : Sep 24, 2020, 4:45 AM IST

Updated : Sep 25, 2020, 6:00 PM IST

షార్ట్​ రన్ కారణంగా దిల్లీ జట్టు చేతిలో ఓడిన పంజాబ్.. న్యాయం జరిగేవరకు తగ్గేదిలేదని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఇప్పటికే ఓ మ్యాచ్​లో గెలిచి ఫుల్​ జోష్​లో ఉన్న కోహ్లీ సేనతో గురువారం దుబాయ్​ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్​లోనైనా సత్తాను నిరూపించుకోవాలని కసితో బరిలో దిగబోతోంది కేఎల్​ రాహుల్​ సేన. మరోవైపు ఆర్సీబీ కూడా తమ విజయాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో పోరుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలపై ఓ లుక్కేద్దాం.

పంజాబ్​

ఈ సీజన్​లో పంజాబ్.. బ్యాటింగ్ విభాగంలో బలంగానే కనిపించినప్పటికీ దిల్లీతో జరిగిన తొలి మ్యాచ్​లోనే విఫలమైంది. 30పరుగుల వద్దే సారథి కేఎల్​ రాహుల్​(21) తేలిపోయాడు. గేల్​ను ఈ మ్యాచ్​కు దూరం పెట్టడం ఈ ప్రాంచైజీ చేసిన ఓ తప్పని భావించవచ్చు. సాధారణంగా వీరిద్దరి ఓపెనింగ్​ జోడీ అద్భుతంగా ఉంటుంది. మ్యాచ్​ను వారివైపు తిప్పుకునే సత్తా వీరిలో ఉంది. కాబట్టి ఆర్సీబీతో జరిగే పోరులోనైనా జట్టు ఈ తప్పును రిపీట్​ చేయకుండా ఉంటే కలిసొచ్చే అవకాశం.

కాగా, మ్యాక్స్​వెల్, మయాంక్ అగర్వాల్, మన్​దీప్ సింగ్​ రూపంలో కావాల్సినంత హిట్టింగ్ లైనప్ ఉంది. మిడిల్ ఓవర్స్​లో పరుగుల వరద పారించేందుకు పాకెట్ రాకెట్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. అలాగే నికోలస్ పూరన్, హార్డస్ విజియోన్, జేమ్స నీషమ్, కరుణ్ నాయర్, క్రిస్ జోర్డాన్ వంటి నాణ్యమైన టీ20 బ్యాట్స్​మన్ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో ఎలాంటి గాయాలు కాకుండా ఉంటే మహ్మద్ షమీ, ముజిబుర్ రెహ్మన్, షెల్డన్ కాట్రెల్, మురుగన్ వారి సత్తా మేరకు రాణించగలరు. అయితే ఇప్పటికే గాయం అయిన అశ్విన్​ ఈ మ్యాచులో ఆడుతాడా లేదా అనేది అనుమానమే.

బెంగళూరు

బెంగళూరు విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తొలి మ్యాచ్​లో సన్​రైజర్స్​పై గెలిచి ఫుల్​ జోష్​లో ఉంది. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో సారథి కోహ్లీ తప్ప అంచనాలు ఉన్న ఆటగాళ్లు దేవదత్‌ పడిక్కల్‌ (56), ఆరోన్‌ ఫించ్‌ (29), ఏబీ డివిలియర్స్‌ (51) అనుకున్నట్లే బాగా రాణించారు. ఇక చాహల్​ తన స్పిన్​ మాయాజలంతో మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. కాబట్టి పంజాబ్​తో జరిగే మ్యాచ్​లోనూ ఫామ్​ ఇలానే కొనసాగిస్తే ఆర్సీబీ మరో విజయాన్ని అందుకునే అవకాశం ఉంది.

స్క్వాడ్​ (అంచనా)

ఛాలెంజర్స్​: విరాట్​ కోహ్లీ(కెప్టెన్​), అరోన్​ ఫించ్​, దేవ్​దత్​ పడిక్కల్​, ఏబీ డివిలియర్స్​, జోష్​ ఫిలిప్పీ(వికెట్​ కీపర్​), శివం దుబే, వాషింగ్టన్​ సుందర్​, ఉమేశ్​ యాదవ్​, నవదీప్​ సైని, స్టెయిన్​, యజ్వేంద్ర చాహల్​

కింగ్స్ ఎలెవన్ పంజాబ్: కేఎల్ రాహుల్(కెప్టెన్), గేల్​, మయాంక్ అగర్వాల్, కరుణ్ నాయర్, గ్లెన్ మ్యాక్స్​వెల్, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, సర్ఫరాజ్ ఖాన్, క్రిస్ జోర్డాన్, షెల్డన్ కాట్రల్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమి.

Last Updated : Sep 25, 2020, 6:00 PM IST

ABOUT THE AUTHOR

...view details