ఐపీఎల్లో మరో సరవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుత సీజన్లో అత్యధిక విజయాలు సాధించిన రెండు జట్లు దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు టీమ్‌లలో టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, బౌలింగ్ లైనప్‌లు చాలా శక్తిమంతంగా ఉన్నాయి. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారనుంది.
ముంబయి పేసర్లను తట్టుకోగలరా?
ముంబయి ఇండియన్స్ బౌలింగ్ లైనప్‌లో అద్భుతమైన పేసర్లు బుమ్రా, బౌల్ట్ ఉన్నారు. వీరిని అడ్డుకోవాలంటే దిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరింతగా కష్టపడాల్సి ఉంటుంది. ధావన్ గతమ్యాచ్ల్లో జట్టుకు సరైన ఆరంభాన్ని ఇచ్చాడు. అదే విధంగా ముంబయితో జరిగే మ్యాచ్‌లోనూ అదే ఫామ్‌ను కొనసాగిస్తాడని ఫ్రాంచైజీ ఆశిస్తోంది.
గత మ్యాచ్‌ల్లో దిల్లీ బ్యాట్స్‌మన్ హెట్మెయిర్ అంతగా రాణించలేదు. కానీ, శుక్రవారం రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడటం వల్ల దిల్లీ బ్యాటింగ్ లైనప్‌లో బలంగా మారినట్లు కనిపిస్తోంది. దిల్లీ ఓపెనర్లతో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా జట్టుకు సరైన సహకారాన్ని అందిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ముంబయి ధనాధన్
ముంబయి ఇండియన్స్ ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్‌లతో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కృనాల్ పాండ్య అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. వారి హిట్టింగ్తో నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ గమనాన్నే మార్చగల సత్తా ఉంది.
అబుదాబి వేదికగా దిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
జట్లు(అంచనా):
దిల్లీ క్యాపిటల్స్: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), రవిచంద్రన్ అశ్విన్, శిఖర్ ధావన్, పృథ్వీ షా, హెట్మెయిర్, కగిసో రబాడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాంత్ శర్మ, అక్షర్ పటేల్, సందీప్ లామిచనే , మోహిత్ శర్మ, అన్రిచ్ నార్ట్జే, అలెక్స్ కారీ, అవేష్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్షల్ పటేల్, మార్కస్ స్టోయినిస్, లలిత్ యాదవ్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఆదిత్య తారే, అన్మోల్‌ప్రీత్ సింగ్, అనుకుల్ రాయ్, క్రిస్ లిన్, ధావల్ కులకర్ణి, దిగ్విజయ్ దేశ్‌ముఖ్, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, జేమ్స్ ప్యాటిన్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, జయంత్ యాదవ్, కీరోన్ పొలార్డ్, కృనాల్ పాండ్య, మొహ్సిన్ ఖాన్, నాథన్ కౌల్టర్-నైల్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, క్వింటన్ డి కాక్, రాహుల్ చాహర్, సౌరభ్ తివారీ, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, సూర్యకుమార్ యాదవ్, ట్రెంట్ బౌల్ట్