ఈ ఐపీఎల్‌ను గెలుపుతో ఆరంభించిన చెన్నై సూపర్ కింగ్స్.. తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్ చేతిలో ఓడింది. మరోవైపు తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై సూపర్ ఓవర్లో విజయం సాధించి జోష్‌లో ఉంది దిల్లీ క్యాపిటల్స్. ఇప్పుడు ఈ రెండు జట్లు శుక్రవారం తలపడనున్నాయి. ఓటమిలో తమ లోపాలను సరిదిద్దుకుని సీఎస్కే, మరిన్ని వ్యూహాలతో దిల్లీ.. గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతున్నాయి. ఈ సందర్భంగా ఇరు జట్ల బలాలు, బలహీనతలు.
దిల్లీ క్యాపిటల్స్
గత మ్యాచులో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(39), పంత్(31), స్టోయినిస్(53) దిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇదే ఫామ్‌ను కొనసాగించి, ఎక్కువ పరుగులు చేస్తే ప్రత్యర్థిపై పైచేయి సాధించే అవకాశముంది. అశ్విన్ పర్వాలేదనిపించినప్పటికీ మిగతా ఆటగాళ్లు విఫలమయ్యారు. అశ్విన్ భుజానికి గాయమవడం వల్ల ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. కాబట్టి సరైనా వ్యూహాలతో దిల్లీ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
చెన్నై సూపర్‌కింగ్స్
చెన్నై జట్టు అంచనాలు తగ్గట్టే తొలి మ్యాచ్‌లో ముంబయిపై విజయం సాధించింది. ఆరోజు అంబటి రాయుడు(71), డుప్లెసిస్ (58) మినహా మిగిలిన వాళ్లు విఫలమయ్యారు. ఆ మ్యాచ్‌లో గాయపడిన రాయుడు.. ఇప్పటికీ కోలుకోనట్లు తెలుస్తోంది. రాజస్థాన్ చేతిలో ఓటమి వల్ల ఈసారి మహీ పదునైనా వ్యూహాలతో బరిలో దిగాల్సి ఉంది. తన బ్యాటింగ్‌పై వస్తున్న విమర్శలను తిప్పికొట్టి, జట్టును విజయంవైపు నడిపించాల్సి ఉంది.
జట్లు(అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: మురళీ విజయ్, షేన్ వాట్సన్, డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, ధోనీ(కెప్టెన్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, సామ్ కరన్, దీపక్ చాహర్, పియూష్ చావ్లా, లుంగి ఎంగిడి
దిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), రిషభ్ పంత్, హెట్మయిర్, మార్కస్ స్టోయినిస్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రబాడా, అన్రిచ్ నోర్ట్జ్, మోహిత్ శర్మ
ఇదీ చూడండి ధోనీ స్టామినా ఏంటో ప్రపంచానికి తెలిసిన రోజు!