ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్లేఆఫ్స్ షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విడుదల చేసింది. నవంబరు 10న దుబాయ్ వేదికగా ఫైనల్ జరగనుంది.
- క్వాలిఫయర్ 1: పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరుగుతుంది.
- ఎలిమినేటర్: పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరుగుతుంది.
- క్వాలిఫయర్ 2: ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుకు, క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు మధ్య జరుగుతుంది.
ప్రస్తుత సీజన్లో అత్యధికంగా(ఫైనల్‌తో కలిపి) 24 మ్యాచ్‌లకు దుబాయ్.. అబుదాబిలో 20, షార్జాలో 12 మ్యాచ్‌లు జరిగేలా ప్రణాళిక వేశారు.