తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూపర్​ ఓవర్​లో బెంగళూరు భళా - బెంగళూరు vs ముంబయి లైవ్ అప్డేట్స్

IPL MATCH, RCB VS MI
ముంబయి vs బెంగళూరు

By

Published : Sep 28, 2020, 6:28 PM IST

Updated : Sep 28, 2020, 11:52 PM IST

23:51 September 28

సూపర్‌ ఓవర్‌లో ముంబయి నిర్దేశించిన 8 పరుగుల లక్ష్యాన్ని బెంగళూరు ఛేదించింది. దీంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కోహ్లీసేన విజేతగా నిలిచి టోర్నీలో రెండో విజయాన్ని నమోదు చేసింది. 


 

23:34 September 28

నవ్‌దీప్‌ సైని వేసిన సూపర్‌ ఓవర్‌లో ముంబయి 7 పరుగులు చేసి ఒక వికెట్‌ కోల్పోయింది. దీంతో బెంగళూరు 8 పరుగులు చేస్తే టోర్నీలో రెండో విజయం నమోదు చేస్తుంది.


 


 

23:18 September 28

దుబాయ్ వేదికగా సోమవారం జరిగిన పోరులో ఆర్సీబీ​, ముంబయి మధ్య మ్యాచ్ టై అయింది. బెంగళూరు జట్టు 201 పరుగులు చేయగా.. ముంబయి సైతం అదే స్కోరు వద్ద నిలిచింది. ముంబయి తరపున ఇషాన్​ కిషన్​(99), కీరన్​ పొలార్డ్​​(80) మ్యాచ్ టైగా ముగియడంలో కీలకంగా వ్యవహరించారు . ఇప్పుడు సూపర్ ఓవర్.. విజేతను నిర్ణయించనుంది.


 

22:57 September 28

క్రీజులో ఉన్న కీరన్​ పొలార్డ్​ సిక్స్​లతో చెలరేగుతున్నాడు. 17 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టానికి 149 పరుగులు చేసింది. విజయానికి 18బంతుల్లో 53 పరుగులు చేయాలి ముంబయి. 

22:54 September 28

క్రీజులో ఉన్న ఇషాన్​(70)స్కోరు బోర్డును పరుగెత్తిస్తున్నాడు  . 16 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టానికి 112 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్​. 

22:48 September 28

15.3 ఓవర్లకు నాలుగు వికెట్లు నష్టానికి 118 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్​. క్రీజులో ఇషాన్​ కిషన్​, కీరన్​ పొలార్డ్​ ఉన్నారు. 

22:01 September 28

ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 52 పరుగులు చేసింది ముంబయి ఇండియన్స్. క్రీజులో హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్ ఉన్నారు. అంతకు ముందు రోహిత్ శర్మ 8, డికాక్ 14, సూర్యకుమార్ యాదవ్ 0 పరుగులకే ఔటయ్యారు.

21:32 September 28

202 పరుగుల ఛేదనను ఆరంభించింది ముంబయి ఇండియన్స్. రెండో ఓవర్​లోనే కెప్టెన్ రోహిత్ శర్మ 8 పరుగులే చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం 2 ఓవర్లలో 16 పరుగులు చేసింది. క్రీజులో డికాక్, సూర్యకుమార్ ఉన్నారు.

21:04 September 28

టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫించ్, దేవ్​దత్ పడిక్కల్, డివిలియర్స్.. తలో హాఫ్ సెంచరీ చేశారు. కోహ్లీ 3 పరుగులే చేసి మరోసారి నిరాశపరిచాడు. ముంబయి బౌలర్లలో బౌల్ట్ 2, రాహుల్ చాహర్ 1 వికెట్ తీశారు.

20:43 September 28

బెంగళూరు జట్టు 16 ఓవర్లు పూర్తయ్యేసరికి రెండు వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. ఓపెనర్ దేవ్​దత్ పడిక్కల్.. అర్థశతకం చేశారు. క్రీజులో దేవ్​దత్, డివిలియర్స్ ఉన్నారు.

20:23 September 28

బెంగళూరు జట్టు నిదానంగా ఆడుతోంది. 12 ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 91 పరుగులు చేసింది. క్రీజులో కోహ్లీ, దేవ్​దత్ పడిక్కల్ ఉన్నారు. ఫించ్ 52 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.

19:44 September 28

ఓపెనర్లుగా దిగిన అరోన్​ ఫించ్​(17), పడిక్కల్(8)​ నిలకడగా ఆడుతున్నారు. మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి బెంగళూరు స్కోరు 26/0.

19:33 September 28

తొలి ఓవర్​ ముగిసే సరికి బెంగళూరు జట్టు స్కోరు 8/0. క్రీజులో అరోన్ ఫించ్​, పడిక్కల్​ ఉన్నారు. 

19:01 September 28

టాస్ గెలిచిన ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్ ప్రారంభించనుంది. ఈ మ్యాచ్​తో స్పిన్నర్ జంపా.. కోహ్లీసేన తరఫున ఆడనున్నాడు. బెంగళూరు జట్టులో కీలకమార్పులు జరిగాయి. జంపా, ఉదానా, గుర్​కీరత్ సింగ్.. ఫిలిప్పి, స్టెయిన్, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో బరిలోకి దిగనున్నారు.

జట్లు

బెంగళూరు

దేవ్​దత్ పడిక్కల్, ఫించ్, కోహ్లీ(కెప్టెన్), డివిలియర్స్, గుర్​కీరత్ సింగ్, శివమ్ దూబే, సుందర్, నవ్​దీప్ సైనీ, చాహల్, ఆడమ్ జంపా, ఇసురు ఉదానా

ముంబయి

డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, పొలార్డ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్, ప్యాటిన్సన్, బౌల్ట్, బుమ్రా

18:14 September 28

కెప్టెన్​గా విరాట్​కు ఇది 150వ టీ20

దుబాయ్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ మధ్య నేడు(సెప్టెంబరు 28) మ్యాచ్​ జరగనుంది. భారతకాలమానం ప్రకారం రాత్రి ఏడున్నరకు ప్రారంభమవుతుంది. గత మ్యాచ్​ కోల్​కతాపై గెలిచి ముంబయి జోరు మీదుండగా, బెంగళూరు మాత్రం పంజాబ్​ ఘోర పరాభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని చూస్తోంది. మరి విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.

Last Updated : Sep 28, 2020, 11:52 PM IST

ABOUT THE AUTHOR

...view details