కీలక ఆటగాడు రాబిన్ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ జట్టు వదులుకుంది. ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా అతణ్ని చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ దక్కించుకుంది. ఇప్పటిదాకా 189 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఉతప్ప.. గత సీజన్లో పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో రాజస్థాన్ జట్టు అతణ్ని వదులుకున్నట్లు తెలుస్తోంది.
ఐపీఎల్: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఉతప్ప - ఐపీఎల్ వార్తలు
ఐపీఎల్లో కీలక ఆటగాడు రాబిన్ ఉతప్పను రాజస్థాన్ రాయల్స్ జట్టు వదులుకుంది. ఇటీవలే జరిగిన ఆటగాళ్ల మార్పిడిలో భాగంగా రాబిన్‌ను చెన్నై సూపర్‌కింగ్స్ టీమ్ దక్కించుకుంది.
![ఐపీఎల్: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఉతప్ప IPL 2021: Uthappa traded from Rajasthan Royals to Chennai Super Kings in all-cash deal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10332945-654-10332945-1611282248224.jpg)
ఐపీఎల్: చెన్నై సూపర్‌కింగ్స్ జట్టుకు ఉతప్ప
ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీలో కేరళకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాబిన్ ఓ మోస్తరుగా ఆడుతున్నాడు. కానీ, అతడి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎస్కే ఉతప్పను కొనుక్కుంది. ఇటీవలే మురళీ విజయ్, కేదార్ జాదవ్‌తో పాటు విదేశీ ఆటగాడు షేన్ వాట్సన్నూ చెన్నై వదులుకుంది.
ఇదీ చూడండి:'కెప్టెన్‌గా స్మిత్ ఓకే.. మరి వార్నర్‌కు ఎందుకీ అన్యాయం?'