ఓవైపు ఐపీఎల్లో ఆడుతూనే మరోవైపు తనకు కాబోయే భార్యతో సరదాగా గడుపుతోన్నాడు బెంగళూరు జట్టు బౌలర్ యుజువేంద్ర చాహల్. తాజాగా తన ఫియాన్సీ ధనశ్రీతో కలిసి సాయం సంధ్య వేళ బీచ్‌లో ఓ ఫొటో దిగాడు. దీన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి.. 'ఇది సరైన సాయంత్రం' అంటూ వ్యాఖ్య జోడించాడు. వైరల్‌గా మారిన ఈ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అభిమానులు తమదైన శైలిలో గుప్పుగా కామెంట్లు కురిపించేస్తున్నారు.
బీచ్‌లో సరదాగా గడుపుతోన్న చాహల్-ధనశ్రీ - దుబాయ్ చాహల్ ధనశ్రీ
దుబాయ్‌లో తనకు కాబోయే భార్యతో కలిసి బీచ్‌లో సరదాగా గడుపుతున్నాడు బెంగళూరు జట్టు ఆటగాడు యుజువేంద్ర చాహల్. దీనికి సంబంధించి ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేయగా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చాహల్-ధనశ్రీ
ఇటీవల దుబాయ్ చేరుకున్న ధనశ్రీ.. ఆర్సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగన మ్యాచ్‌కు హాజరైంది. ఆ సమయంలో కోహ్లీ సతీమణి అనుష్క శర్మతో సహా బెంగళూరు జట్టుకు చెందిన ఆటగాళ్లతో కలిసి ఓ ఫొటో దిగి నెట్టింట్లో పోస్ట్ చేసింది.
ఇదీ చూడండి పంజాబ్‌తో దిల్లీ మ్యాచ్.. పంత్ రీఎంట్రీ!